అపురూప దర్శనం..చూసిన కనులదే భాగ్యం...
ఏడాదిలో ఒక్కరోజే దర్శన భాగ్యం.... సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూపాన్ని వీక్షించే అదృష్టం భక్తులకు కలుగుతుంది. వరాహ నారసింహ అవతారాల సమ్మేళనంగా విరాజిల్లుతున్న సింహాద్రి నాథుడి నిజరూపాన్ని వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం ఈరోజు కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తుల విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూపంలో సంవత్సరంలో ఒక్క రోజున మాత్రమే అక్షయ తృతీయనాడు దర్శనమిస్తారు. ఆ రోజున స్వామి వారిని లక్షలాదిమంది దర్శించుకుని భక్తి పారవస్యంతో పునీతులవుతారు. ఏడాది పొడవునా చందనం పూతతో ఉంటూ శాంతమూర్తిగా దర్శనమిచ్చే వరాహస్వామిని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు... త్రిలోకాలలో నారసింహుని వంటి దైవం, సింహాచల క్షేత్రం వంటి పుణ్యక్షేత్రం, నిరంతరం ప్రవహిస్తూ మనల్ని పునీతులను చేసే గంగధార వంటి తీర్థం లేదని చెబుతుంటారు. ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చిన నరసింహ స్వామి సింహగిరిపై వరాహ నారసింహ అవతారంలో దర్శనమిస్తున్నారని ప...