నిత్యం వార్డుల్లో పర్యటిస్తా...మేయర్ పీలా

 జీవీఎంసీ ఉన్నతాధికారులతో మేయర్ సమీక్ష

మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
నగర మేయర్ పీలా శ్రీనివాసరావు


విశాఖపట్నం ఏప్రిల్ 28:

నగర ప్రజలకు కల్పించవలసిన మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మేయర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో జీవీఎంసీ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అందించే మౌలిక వసతులపై , నగర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజలకు కల్పించవలసిన  ప్రజారోగ్యం, వీధిలైట్లు, తాగునీరు మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ ప్రజారోగ్యం దిశగా నిత్యం అధికారులు వార్డులలో పర్యటించి పారిశుధ్య మెరుగుకు కృషిచేసి విశాఖ మరింత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీరు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ తాగునీటి విభాగపు అధికారులను ఆదేశించారు. జీవీఎంసీలో అనవసరపు అదనపు ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంచి పాలన ప్రజలకు అందించేందుకు సూచనలు, సలహాలు అందించి సహకరించాలన్నారు. అధికారులు గీతలు, హద్దులు దాటి విధులు నిర్వహించరాదని సూచించారు. జీవీఎంసీ డాష్ బోర్డు, సిటీ ఆపరేషన్స్ సెంటర్ సమాచారం నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు వార్డులలో పర్యటిస్తానని మేయర్ తెలిపారు. ఇంతవరకు టెండర్లు తీసుకొని పనులు చేపట్టలేని వారిపై దృష్టి సారించి  పనులు సకాలంలో జరిగేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .

సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా తాగునీటి విభాగానికి 8 కోట్లు మంజూరు అయ్యాయని వాటితో నీటి ట్యాంకులు, పైపులైన్ల మరమ్మత్తులు, కొత్త బోర్లు ఏర్పాటు, పాత బోర్ల మరమ్మత్తులు చేపడతామని జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు కె.శివప్రసాదరాజు మేయర్ కు వివరించారు. వీధిలైట్లు నిర్వహణ లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జీవీఎంసీ నిధులు వినియోగంలో ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలన్నారు. ఇకపై నిత్యం వార్డుల్లో పర్యటిస్తానని మేయర్ అధికారులకు తెలిపారు. చలివేంద్రాలు పటిష్టంగా ,పరిశుభ్రతతో నిర్వహించాలని ప్రధాన ఇంజనీర్ కు మేయరు ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి. రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, పిడి-యు.సి.డి పి.ఎమ్.సత్యవేణి, డిడిహెచ్ ఎమ్.దామోదరరావు, కార్యదర్శి బి.వి.రమణ, ఫైనాన్సు అడ్వైజర్ మల్లికాంబ, పర్యవేక్షక ఇంజనీర్లు, సిటీ ప్లానర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయక వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు. 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న