చిత్ర కళ...భళా...

 ఉన్నత లక్ష్యాలతో యువతరం ఎదగాలి 

 విద్యార్థులు ప్రతిభతో ఆకట్టుకున్నారు 
 చిత్రకళా ప్రదర్శన ప్రారంభం
జూన్ 1 వరకు కొనసాగుతున్న ప్రదర్శన 

ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నతంగా రాణించాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ.నరసింహారావు ఆకాంక్ష వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఏయు చిత్రకళా విభాగంలో ఏర్పాటు చేసిన బిఎఫ్ఏ,ఎంఎఫ్ఏ విద్యార్థుల వార్షిక చిత్రకళా ప్రదర్శనను ఆయన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో అభ్యసించడం గర్వకారణమని చెప్పారు. విద్యార్థులు సృజనాత్మకత, నైపుణ్యాలతో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్ది ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను కార్యరూపంలో చూపుతూ తీర్చిదిద్దిన శిల్పాలు, చిత్రాలు అత్యుత్తమంగా నిలుస్తున్నాయని చెప్పారు.

విభాగాధిపతి డి.సింహాచలం మాట్లాడుతూ జూన్ 1వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని అన్నారు. విద్యార్థులు తయారుచేసిన శిల్పాలు, కళారూపాలు, చిత్రాలు ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. నగరవాసులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించాలని కోరారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు శిష్ట్లా శ్రీనివాస్, విశ్రాంత ఆచార్యులు వి.రమేష్, ఎం.ఆదినారాయణ, టి. సుధాకర్ రెడ్డి, బి.మహేశ్వర దాస్, మయూఖ కుమారి దేవీ తదితరులు చిత్రకళా ప్రదర్శనను సందర్శించి విద్యార్థులను అభినందించారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న