చిరుధాన్యాలను ఉపయోగించి రాజా రవి వర్మ చిత్రపటం
చిరుధాన్యాలతో రాజా రవి వర్మ చిత్రపటం
విశాఖపట్నం ఏప్రిల్ 28:
భారతీయ ప్రముఖ చిత్రకారుడు రాజా రవి వర్మ జయంతి (April 29) ని పురస్కరించుకొని నగరానికి చెందిన మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ చిరుధాన్యాలను ఉపయోగించి రాజా రవి వర్మ చిత్రాన్ని తీర్చిదిద్దారు. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరును తీసుకువచ్చిన రాజా రవి వర్మ కు కళాకారుడిగా తనదైన శైలిలో జన్మదినం సందర్భంగా వినూత్నంగా నివాళిని అర్పించారు. వారం రోజులుగా శ్రమించి సహజత్వం ఉట్టిపడే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి