నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడవద్దు
కన్వెన్షన్ సెంటర్ పనులు వేగవంతం చేయాలి
వి.ఎం ఆర్ డి ఎ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సాంకేతిక విభాగపు సమీక్షా సమావేశంలో పాల్గొన్న చైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. జోన్ల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని చీమలపల్లి మరియు ఎండాడ వద్ద సంస్థ నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభోత్సవం జరిపి అందుబాటులోకి తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వెంకోజిపాలెంలో పునః నిర్మిస్తున్న కళ్యాణమండపం పనులను కూడా పూర్తి చేసి రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ దృష్టిలో పెట్టుకొని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నిర్మాణ పనులు నాణ్యతలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడవద్దని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమీషనర్ రమేష్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్ పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, బలరామరాజు, కార్యనిర్వహక ఇంజినీర్లు, ఉపకార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి