పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత

 పేదవారికి అందుబాటులో ఉంటాను...

ప్రజారోగ్యానికి ప్రాధాన్యతే ద్యేయం

-నగర మేయర్ పీలా శ్రీనివాసరావు

విశాఖపట్నం ఏప్రిల్ 28;

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థిగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు మేయరుగా ఎంపిక చేసి తనకు కీలక బాధ్యతలను అప్పచెప్పారని నగర మేయర్ గా ఎన్నికైన పీలా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నగర మేయరుగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశం మందిరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ మా తండ్రిగారైన పీల మహాలక్ష్మి నాయుడు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసేవారని ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించిన మేయర్  బాధ్యతలను చిత్త శుద్ధితో నెరవేరుస్తానని, ముఖ్యంగా పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజారోగ్యానికి  ప్రాధాన్యతను ఇస్తానని, తక్కువ కాలంలో వచ్చిన ఈ పదవిని దాని విలువలను మరింత పెంచుతానని, ప్రతి ఇంటికి తాగునీరు సకాలం లో అందించేందుకు కృషి చేస్తానన్నారు. నగర అభివృద్ధి విషయం లో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తూ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు, సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని,  పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ విషయం లో అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో మహా విశాఖపట్నం నగర పాలక సంస్థకు మేయర్ గా ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు మరియు విశాఖపట్నం లోక్ సభ సభ్యులు, విశాఖ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కూటమి కార్పొరేటర్లకు కృతజ్ఞతలను  తెలియజేశారు.

తదుపరి పాత్రకేయుల సమావేశం అనంతరం నగర మేయరు పీలా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకరు రఘురామ క్రిష్ణం రాజు, మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణను ప్రభుత్వ అతిధి గృహంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న