సామాజిక సేవతో విశేష గుర్తింపు

 సామాజిక సేవతో విశేష గుర్తింపు 
- ప్రజల సంపూర్ణ వికాసంలో భాగస్వామ్యం కావొచ్చు 

సామాజిక సేవతో విశేష గుర్తింపు లభిస్తుందని,ప్రజల సంపూర్ణ వికాసం లో భాగస్వామ్యం కావొచ్చుని ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగధిపతి ప్రొఫెసర్ సర్వసిద్ధి హరనాధ్ పేర్కొన్నారు. మీజోరం సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన సోషల్ వర్క్ విభాగం విద్యార్థులు సోమవారం ఏయు లోని సోషల్ వర్క్ విభాగాన్ని సందర్శించారు.  ఈ సందర్బంగా విభాగధిపతి ప్రొఫెసర్ హరనాధ్ మాట్లాడుతూ సామాజిక సేవలో నిజమైన సంతృప్తి ఉంటుందన్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, కార్పొరేట్, స్వచ్చంద సంస్థ లలో ఉద్యోగాలు ఉన్నాయన్నారు.  విద్యార్థులు అంకిత భావంతో చదువుకొని తల్లిదండ్రులు కలలను సాకారం చేయాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను అర్ధం చేసుకొని ముందుకు సాగాలన్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమం లో బిఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ,మిజోరం సెంట్రల్ యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం ఆచార్యులు K. శేఖర్,  డాక్టర్ బాబా వల్లి, అధ్యాపకులు డాక్టర్ అబ్రహం, శ్యామ్ కుమార్, ఆశా కిరణ్, లక్ష్మణరావు, పుష్పలత, వేసవిల,శిరీష, సూరిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న