బంగారు పతకాలకు నగదు బహుకరణ
బంగారు పతకాలకు నగదు బహుకరణ
ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ విభాగంలో ఎం.ఎల్.ఐ.సి కోర్సులో మొదట ర్యాంక్ సాధించిన విద్యార్థికి బంగారు పతకాన్ని అందజేయాలని కోరుతూ విభాగ విశ్రాంత ఆచార్యులు సి.శశికళ రూ 1,50,000/- చెక్కును ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ కు అందజేశారు. తమ తల్లిదండ్రులు చాగరి నవనీతమ్మ, నారాయణరెడ్డి ల పేరుతో చాగరి ఎన్ & ఎన్ రెడ్డి గోల్డ్ మెడల్ గా దీనిని విద్యార్థులకు బహుకరించాలని కోరుతూ నగదుకు సంబంధించిన చెక్కును అందజేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ గా సేవలందిస్తున్న డాక్టర్ వై.ఆర్ రెడ్డి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి బంగారు పథకాన్ని అందించాలని కోరుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతికి రూ 1,50,000/- చెక్కును అందజేశారు. తమ తల్లిదండ్రులు వై. సీతారామమ్మ, వెంకట రమణారెడ్డిల పేరు మీదుగా వైయస్ & వైవిఆర్ఆర్ గోల్డ్ మెడల్ గా విద్యార్థులకు దీనిని బహూకరించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కోరారు.
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బంగారు పతకాలు అందించడానికి అవసరమైన నిధులను విశ్వవిద్యాలయానికి అందజేసిన ఆచార్య శశికళ, డాక్టర్ వై.ఆర్ రెడ్డి లను ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తిని కలిగిస్తాయని, వారు మరింత ప్రతిభతో ముందుకు వెళ్లడానికి ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ .ఎన్ ధనంజయరావు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి