కలిశెట్టి యోగేంద్రకు డాక్టరేట్

 కలిశెట్టి యోగేంద్రకు డాక్టరేట్

ఆంధ్ర విశ్వకళా పరిషత్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల గణాంక విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి కలిశెట్టి యోగేంద్ర “సమ్ ఎకనామిక్ స్టాటిస్టికల్ డిజైన్ ఆఫ్ X బార్ కంట్రోల్ చార్ట్స్ విత్ ఎడిటివ్ ఎక్స్పొనెన్షియల్ అండ్ హైపోఎక్స్పోనెన్షియల్ షాక్ మోడల్స్ (SOME ECONOMIC STATISTICAL DESIGN OF X̄ CONTROL CHARTS WITH ADDITIVE EXPONENTIAL AND HYPOEXPONENTIAL SHOCK MODELS)” అనే అంశంపై ఆచార్య కట్నేని నిరుపమా దేవి మరియు సీనియర్ ఆచార్యులు క్రాలేటి శ్రీనివాసరావు (విశ్రాంత) గార్ల సంయుక్త పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను, “డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్ డీ)’’ పట్టాను గౌరవ ఉపకులపతి ఆచార్య జీ. పీ. రాజశేఖర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. కలిశెట్టి యోగేంద్ర గారు తన ఈ అవార్డును తల్లిదండ్రులు మరియు గురువులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా పర్యవేక్షకులు, బోధనా సిబ్బంది, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న