మత్స్యకారులకు ఆర్ధిక సాయం పంపిణీ

  మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట 
గాజువాకలో రూ. కోటి 6 లక్షల ఆర్ధిక సాయం పంపిణీ 

 మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల సేవలో పథకం కింద గాజువాక నియోజకవర్గంలోని మత్స్యకారులకు ఆర్ధిక సాయం అందిస్తూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మరో మైలురాయి సాధించారు. ఈరోజు ఆయన దిబ్బపాలెం, గంగవరం, జాలరిపల్లెపాలెం గ్రామాల్లో 530 మంది మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.1 కోటి 6 లక్షల ఆర్ధిక సాయం చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, "మత్స్యకారులు సముద్రంలో వేట విరామ సమయంలో ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులను తగ్గించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన 'మత్స్యకారుల సేవలో' పథకం ద్వారా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20,000 సాయం అందిస్తోంది. రాష్ట్రం మొత్తం 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.258 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గాజువాక నియోజకవర్గంలోనూ 530 మంది మత్స్యకార కుటుంబాలు ఈ ప్రయోజనం పొందాయి," అని చెప్పారు.

"ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారుల ఆర్ధిక సాయం మొత్తాన్ని రెండు రెట్లు పెంచడం ద్వారా కూటమి ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వంగా నిలిచింది. మత్స్యకారుల జీవన ప్రమాణం మెరుగుపడేలా మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తాం," అని ఆయన హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో వేట విరామ సమయంలో రూ.10,000 మాత్రమే అందించగా, నేడు దాన్ని రూ.20,000కి పెంచి మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఊరట కల్పించిందని పల్లా శ్రీనివాసరావు గారు గుర్తు చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన పథకాలను గుర్తుచేస్తూ, వచ్చే రోజుల్లో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. డీజిల్‌పై రూ.9 సబ్సిడీ, వేట సమయంలో మత్స్యకారులకు ప్రాణ భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న