పోలీసు సిబ్బందికి చల్లని వార్త....

 పోలీసులు...కూల్ గా సేవలు అందిస్తారు...

థాంక్యూ.... కమీషనర్ సాబ్

అసలే వేసవి కాలం...ఎండలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి....కాలు బయట పెట్టాలంటేనే భయం వేస్తోంది...అటువంటిది పోలీసులు గంటల తరబడి ఎండలో నిలబడి విధులు నిర్వహించడం కష్టతరమైన విషయం. మరి మన బధ్రత కోసం పనిచేసే పోలీసులకు చల్లని వార్త వినిపించడం కాదు....చూపించారు...నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి...నగర పౌరుల బధ్రతతో పాటు...తమ సిబ్బంది యోగక్షేమాలనుచు సైతం చూడడం కమిషనర్ కు అలవాటే... తమ సిబ్బంది కోసం ఆయన ఒక వినూత్న ప్రయత్నం చేశారు. మండువేసవల సైతం కూల్ కూల్ గా వారు విధులు నిర్వహించాలని భావించి, వారికి సరికొత్త కూల్ జాకెట్ లను సమకూర్చారు. వారి కష్టాన్ని తెలుసుకుని చొరవ తీసుకున్న పోలీస్ బాస్ కి మనసారా ధన్యవాధాలు... కొత్త  ప్రయత్నం పోలీసులకు మేలు చేయాలని మనసారా కోరుకుందాం....

విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వేసవి ఎండల నుండి ఉపశయం లభించింది. గత   అక్టోబర్ లో ఢిల్లీలో జరిగిన "ట్రాఫిక్ ఎక్స్ పో" లో ట్రాఫిక్ విభాగ నుండి ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు వెళ్లి కొత్త సాంకేతిక ను పరిశీలించారు. హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన 98°F అనే కంపెని వారు "కూల్ జాకెట్లను" అక్కడ ఎక్స్పో లో ప్రదర్శించారు  మండుటెండల్లో పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి చల్లదనం అందించే విధముగా ఉండే "రేడియ॥ కూల్ జాకెట్లు" ను నగరంలో కొందరు దాతలు సహాయం తో సుమారు రూ.5,00,000/- లు విలువ గల 200 కూల్ జాకెట్లను గురుగ్రామ్ నుండి రప్పించారు విశాఖ పోలీస్ కమీషనర్. వీటిని ట్రాఫిక్ సిబ్బందికి పంపిణి చేసారు. ఈ కూల్ జాకెట్లు ప్రత్యకత ఏమంటే వీటిని సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో ముంచి చూస్తే వాటి యొక్క ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోతుంది. తర్వతా సిబ్బందికి హాయిగా ఉంది.ట్రాఫిక్ విధులు సమర్థవంతముగా నిర్వర్తించడానికి విలౌతుంది. అలాగే వేటిని శీతాకాలంలో సాధారణంగా వాడుకోవచ్చు. అలాగే రేడియం స్టిక్కరింగ్ ఉండడంతో వీటిని రాత్రిపూట కూడా ధరించి విధులు నిర్వహించవచ్చు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న