ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఒడిస్సా గవర్నర్

 ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఒడిస్సా గవర్నర్ 

విశాఖపట్నం ఏప్రిల్ 27: 

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు ఆదివారం ఉదయం సందర్శించారు. ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ గవర్నర్ కి స్వాగతం పలికారు. అనంతరం ఏయు ఉపకులపతి కార్యాలయంలో గవర్నర్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రగతి భవిష్యత్ ప్రణాళికలను ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ గవర్నర్ కు వివరించారు. విద్యార్థులకు  ఉపయుక్తంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, విశ్వవిద్యాలయ అవసరాలకు సరిపోయే విధంగా సౌర విద్యుత్ ఉత్పత్తిని జరిపే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, విశ్రాంత ఆచార్యులుగా సేవలందించి నేడు ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ గా సేవలందిస్తున్న డాక్టర్ కె. హరిబాబును ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున వీసి రాజశేఖర్ సత్కరించారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న