రాష్ట్రానికి విలువైన ఆభరణంగా ఏయూ నిలుస్తోంది

 ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఖ్యాతి సాధించాలి

అత్యుత్తమ బోధనా విధానాలను అమలు చేయండి
రాష్ట్రానికి విలువైన ఆభరణంగా ఏయూ నిలుస్తోంది
 నగర పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాగ్చి



విశాఖపట్నం ఏప్రిల్ 26:

 రాష్ట్రానికే తలమానికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తుందని, ఇది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించాలని నగర పోలీస్ కమిషనర్  డాక్టర్ శంఖబ్రతా బాగ్చి అన్నారు. ఈరోజు ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం వద్ద శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం శతాబ్ది ఉత్సవాల లో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బెలూన్ ను ఎగురవేశారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అత్యుత్తమ బోధనా విధానాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అమలు చేయాలని సూచించారు. ఏయూ విద్యార్థులు సాధిస్తున్న ఉద్యోగ అవకాశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటిగా నిలుస్తోందని చెప్పారు. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు ఆచార్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వస్తారని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను సాధించాలని అన్నారు. .యూ ఉప కులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘనమైన వారసత్వాన్ని కలిగి ఉందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. అంతర్జాతీయంగా ఏయూ ప్రగతిని ప్రస్ఫుటం చేసే విధంగా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. పోలీస్ కమిషనర్ అందించిన విలువైన సూచనలను విజన్ డాక్యుమెంట్ లో భాగం చేస్తామని చెప్పారు. విదేశీ విద్యార్థులను, ఆచార్యులను ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వాగతిస్తుందని అన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఏయు పరిపాలన భవనం, స్నాతకోత్సవ మందిరం, సిరిపురం కూడలి వద్దనున్న విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాలకు, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు , , .పీ పాత్రో తో సహా పలువురు ప్రముఖుల విగ్రహాలకు  పూలమాలలు వేశారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నం (లోగో) కి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య .ఎన్ ధనుంజయ రావు, ప్రిన్సిపాల్స్, ఆచార్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న