ఆచార్యులకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

 విద్యకు ప్రత్యామ్నాయం లేదు

తల్లిదండ్రులు గర్వించే విధంగా  ముందుకు సాగండి
ఎ యు తెలుగు విభాగం ఆచార్యులకు ఆత్మీయ సత్కారం


విశాఖపట్నం :

సమాజంలో దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుందని ఒక్క విద్యకు మాత్రమే లేదని  కాబట్టి ఈ రంగంలో ఎంత ఇష్టపడి చదివితే అంత మంచి ఉద్యోగం, ఉపాధి  సాధించవచ్చనని తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య జెర్రా అప్పారావు అన్నారు. సోమవారం ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన  ఆచార్యులు ఆత్మీయ సత్కార కార్యక్రమంకు సభాధ్యక్షత వహించిన ఆచార్య అప్పారావు మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో  చదువుకున్న వారంతా నేడు  ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. పీజీ పూర్తి చేసుకున్న విద్యార్ధులు వెంటనే  మరింత  ఉన్నత విద్య  అభ్యసించాలన్నారు. కష్టపడి చదివి పోటీ పరీక్షలులో  మంచి మార్కులు సాదించాలి అని ఆకాంక్ష వ్యక్తము చేసారు. చదువుకున్న వారికి అనేకమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అలాగే గర్వం లేకుండా ఆచార్యులకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలన్నారు.గౌరవ ఆచార్యులు వెలమల సిమ్మన్న మాట్లాడుతూ నిరంతరం చదువుకున్నవారే వారు కోరుకున్న రంగంలో రాణిస్తారన్నారు. కాబట్టి విద్యార్థులు అంతా కష్టపడి చదివి యూనివర్సిటీకి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు పెంపొందించాలని సూచించారు. 

ఆచార్యులు డాక్టర్ గజ్జ యోహాను బాబు, డాక్టర్ యోగి వెంకటేశ్వర్లు. డాక్టర్ ఏ.ఈశ్వరమ్మ, డాక్టర్ కట్టె పోగు రత్న శేఖరు, డాక్టర్ పెండ్యాల లావణ్యలు మాట్లాడుతూ తమ వద్ద విద్యాభ్యాసం సాగించిన విద్యార్థులు ఉన్నత రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వారికి అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఎ.యూ పరిశోధక  విద్యార్థి, తెలుగు విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థి గంట్ల శ్రీను బాబు ఆధ్వర్యంలో ఆచార్యులు ను ఘనంగా సత్కరించారు. వీరికి సింహాద్రి నాధుడు జ్ఞాపిక లు అందచేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరంతా గంట్లశ్రీను బాబు ను ఘనంగా సత్కరించారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న