విశాఖ నగరానికే వన్నెతెచ్చారు...
క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలవడుతుంది - క్రీడలకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది - ప్రపంచ పటంలో క్రీడల్లో విశాఖ తన స్థానం పదిలం విశాఖపట్నం మే 31: క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలబడుతుందని తద్వారా వారు సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని పలువురు శాసనసభ్యులు అన్నారు. శనివారం సాయంత్రం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీగా ఎంపికైన డాక్టర్ డి. భగీరథ కుమార్, ఐ సి ఏ ఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.ప్రసన్న కుమార్ ల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యుల గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. ప్రపంచ పటంలో క్రీడల్లో విశాఖ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది అని అన్నారు. యువత విద్యతోపాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. తద్వారా రాష్ట్రానికి, దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం సాధ్యపడుతుందని అన్నారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్నకుమార్ లు జాతీయస్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం నగరానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. విశాఖ నగరానికి, తాము చేపట్టిన పదవులక...