ఎన్టీఆర్ జయంతి సందర్భంగా క్రీడా దుస్తులు పంపిణీ

 పేదల పాలిట పెన్నిధి నందమూరి తారకరామారావు
- ఎన్టీఆర్ జయంతి సందర్భంగా క్రీడా దుస్తులు పంపిణీ 
- పోషకాహార పంపిణీ

పేదవారి కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చే దిశగా కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారకత రామారావు నిలుస్తారని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా ఎన్టీఆర్ 102 వ జయంతిని విభాగంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య షారోన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సంస్కరణలకు ఎన్టీఆర్ కృషి చేసిన విధానాన్ని వివరించారు.

 పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించడం, గృహ నిర్మాణం చేయడం, క్యాపిటేషన్ ఫీజుల రద్దు, వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకుల, ఆశ్రమ పాఠశాలలను నెలకొల్పి విద్యారంగానికి అనే ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. మహిళల కోసం ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా ఉన్నత విద్యను వారికి చేరువ చేసిన విద్యాప్రదాతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలుస్తారని చెప్పారు. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం, 33% రిజర్వేషన్ కల్పన, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా స్త్రీల సర్వతో ముఖాభివృద్ధికి ఎన్టీఆర్ బాటలు వేశారని చెప్పారు.  రాజకీయ పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లో విజయం సాధించి ఒక సరికొత్త చరిత్ర సృష్టించిన ఘనత ఆయనకే సొంతమని అన్నారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో సైతం ముఖ్య భూమిక పోషించి, నేషనల్ ఫ్రంట్ అధ్యక్షునిగా ఆయన అందించిన సేవలను ప్రజలు గుర్తించుకుంటారని అన్నారు. ఎన్టీఆర్ జయంతిని అధికారంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఆచార్య షారోన్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకుడిగా తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నందమూరి తారక రామారావు దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసిన సందర్భాన్ని ఈ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఆలీ, డాక్టర్ రాము పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు. 

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ....

ప్రజల మనిషిగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫుట్బాల్ క్రీడలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అవసరమైన క్రీడా దుస్తులను ఆచార్య షారోన్ రాజు విద్యార్థులకు ఈ సందర్భంగా బహుకరించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు పోషకాహారాన్ని వితరణ చేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అభిలాష వ్యక్తం చేశారు. 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న