విప్లవ జోహార్లు ...మన్యం వీరుడా....
మన్యం వీరుడా....స్వాతంత్య్ర ధీరుడా...జోహార్లు....
స్వాతంత్య్ర సమర యోధుడు, గిరిజనుల హక్కులకై పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ వద్ద అల్లూరి విగ్రహానికి నివాళులు అర్పించారు. విప్లవ జ్యోతి, విప్లవ వీరుడు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ మాట్లాడుతూ మన్యం వీరులైనటువంటి, విప్లవ జ్యోతి అయినటువంటి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించి చిరస్మయుడుగా మిగిలిపోయారని అన్నారు.
మన్యం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన వారి మనసుల్లో చిరస్తాయిగా నిలిచిపోయారని చెప్పారు ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క స్మృతులను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వెలమ మ సంక్షేమ సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి పెదిరెడ్ల సత్యం, విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి రెడ్డి ఈశ్వరరావు, అనకాపల్లి ఇంచార్జీ బర్ల పైడం నాయుడు,వరుదు రాజ్ కుమార్,పెదిరెడ్ల శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి