వేలంపూడి జ్యోత్స్న కల్పనకి డాక్టరేట్
మెరైస్ ఇంజనీరింగ్ లో వేలంపూడి జ్యోత్స్న కల్పనకి డాక్టరేట్
ఆంధ్ర యూనివర్సిటీ లో మెరైస్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని వేలంపూడి జ్యోత్స్న కల్పన, "గ్రాఫీస్ నానోప్లేట్లెట్లు మరియు బోరాస్ కార్బైడ్ నానో పదార్థాలను ఉపరితల మార్పుతో ఉపయోగించి హైబ్రిడ్ కాంపోజిట్ పనితీరు మెరుగుపరచడంపై అధ్యయనం" అనే అంశం పై ఆచార్య వి. వి. ఎస్. ప్రసాద్ పర్యవేక్షణ లో పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో ఆమె అంతర్జాతీయ జర్నళ్లలో పరిశోధన పత్రాలు ప్రచురించడమే కాకుండా, పలు అంతర్జాతీయ సదస్సుల్లో వ్యాసాలు ప్రచురించారు. తన పరిశోధనలో, గ్లాస్ మరియు జ్యూటస్ ఫైబర్లతో బలపరిచిన ఎపోక్సీ ఆధారిత హైబ్రిడ్ కాంపోజిట్లలో గ్రాఫీస్ నానోప్లేట్లెట్లు మరియు బోరాస్ కార్బైడు నానో ఫిల్లర్లుగా కలపడం ద్వారా మెకానికల్, ఫ్యాటిగ్ మరియు ధర్మల్ లక్షణాలను విశ్లేషించారు. నానోకణాల విస్తరణపై ఉపరితల మార్పు ప్రభావాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా ఆమె పరిశోధన జరిగింది. కాంపోజిట్ నమూనాలను తయారు చేయడానికి వినూత్నమైన vacuum assisted resin transfer molding పద్ధతిని ఉపయోగించారు. ఈ కాంపోజిట్లు సముద్ర వేదికల, టార్పెడో స్, ఆటోనోమస్ గైడెడ్ వెహికల్స్, టగ్ బోట్లు, వేగవంతమైన బోట్ల వంటి సముద్ర సంబంధిత అనేక వినియోగాలలో ఉపయోగపడతాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులకు తన పరిశోధనకు అవకాశం కల్పించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ తన కార్యాలయంలో కల్పనను అభినందించి డాక్టరేట్ ఉత్తర్వులు అందజేశారు. మెరైస్ విభాగం అధ్యాపక వర్గం మరియు కుటుంబ సభ్యులు ఆమె విజయాన్ని అభినందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి