'ఆదిత్య' విద్యార్థులకు ర్యాంకుల పంట
'ఆదిత్య' విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు
ఆదిత్య డిగ్రీ కళాశాల విశాఖపట్నం విద్యార్థులు ఆంధ్రా యూనివర్శిటీ డిగ్రీ కోర్సు వివిధ విభాగాలలో యూనివర్శిటీ ఫలితాలలో 1, 2, 3 ర్యాంక్లను మొత్తం 12 ర్యాంకులను కైవసం చేసుకున్నారు.
బి.సి.ఏ. విభాగం నుండి దున్నా ధనలక్ష్మి 1వ ర్యాంక్ (9.53 సిజిపిఎ), అమ్ూర్ పావని 2వ ర్యాంక్ (9.51 సిజిపిఏ), పెన్మత్స క్యాతిశ్రీ 2వ ర్యాంక్ (9.51 సిజిపిఏ), బొడువు శిరీష 3వ ర్యాంక్ (9.50 సిజిపిఏ), గంగు రిపిక 3వ ర్యాంక్ (9.50 సిజిపిఎ)ను మొదటి మూడు స్థానాలు ఆదిత్య డిగ్రీ బిసిఏ విద్యార్థులు కైవసం చేసుకోగా, బిబిఎ విభాగం సంతనదు కోరిపోలు మహిత 2వ ర్యాంకు (9.04 సిజిపిఏ), వానపల్లి మౌనిక 3వ ర్యాంక్ (9.1 సిజిపిఏ), గుండ్రు వెంకటసాయి కీర్తి 3వ ర్యాంక్ (9.0 సిజిపిఏ), బి.ఎస్సి. విభాగం నుండి మండల యమున 1వ ర్యాంక్ (9.74 సిజిపిఏ), సత్తి మోనిక విషాల్ 3వ ర్యాంక్ (9.72 సిజిపిఏ), బి.కామ్ విభాగం నుండి పల్లేటి పల్లవి 3వ ర్యాంక్ (8.96 సిజిపిఏ), ప్రెసింగ్ హరిప్రియ 2వ ర్యాంక్ (8.96 సిజిపిఏ) మొత్తంగా బిసిఏ విభాగంలో 5 ర్యాంక్లు, బిబిఏ విభాగంలో 3 ర్యాంకులు, బిఎస్సి విభాగంలో 2 ర్యాంకులు, బి.కామ్ విభాగంలో 2 ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
యూనివర్శిటీ పరీక్షలో అత్యధిక ర్యాంకులను సాధించిన ఆదిత్య డిగ్రీ విద్యార్థులను ఆంధ్రాయూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇ.ఎన్. ధనంజయ రావు గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు. యూనివర్శిటీ పరీక్షలలో అత్యధిక ఉత్తీర్ణత సాధించడంతోపాటు మొదటి 3 ర్యాంకులు కూడా ఆదిత్య విద్యార్థుల కైవసం అయినందున ఆదిత్య డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలు ఉన్నతమైన విద్యాప్రమాణాలు, అధ్యాపకుల యొక్క కార్యదక్షతను కొనియాడారు. యూనివర్శిటీ పరీక్షలలో విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించడం తమకు గర్వకారణమని తెలియజేసారు.
ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఎన్. శేషారెడ్డి గారు యూనివర్శిటీ ర్యాంక్లతో మరియొకసారి తమ విద్యార్థుల సత్తా చాటినందుకు విద్యార్థులను కొనియాడారు. ఆదిత్య డిగ్రీ & పిజి కళాశాలల సెక్రటరీ డాక్టర్ సుగుణ రెడ్డి గారి డిగ్రీ విద్యార్థులు యూనివర్శిటీ పరీక్షలలో అత్యధిక ఉత్తీర్ణతతోపాటు మొదటి 3 ర్యాంకులు కూడా ఆదిత్య విద్యార్థులకే వచ్చినందుకు అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకబృందాన్ని కొనియాడారు.
ఆదిత్య డిగ్రీ కళాశాల సెక్రటరీ డాక్టర్ సుగుణా రెడ్డి గారు మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థుల యూనివర్శిటీ ర్యాంక్లలో ఎక్కువ ర్యాంకులతోపాటు అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు. 2024-25 విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 15120 కేంపస్ ప్లేస్మెంట్స్ కైవసం చేసుకోవడమే కాకుండా విద్యాప్రమాణాలలో కూడా మొదటి స్థానాలలో నిలిచినందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ ప్రిన్సిపాల్స్ని, అధ్యాపకులను అభినందించారు.









కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి