ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
– 95.86% విద్యార్థులు అర్హత
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేశారు ఏ.యు అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసెట్ చైర్మన్, ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ఫలితాలకు సంబంధించిన సిడిని విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు, ఐసెట్ కన్వీనర్ ఆచార్య ఎం.శశి, సహ కన్వీనర్ ఆచార్య కె.రమాసుధ తదితరులు పాల్గొన్నారు.
ఐసెట్ ప్రవేశ పరీక్ష కు 37,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 34,131 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది ఉతీర్ణత సాధించారు. పురుషుల విభాగంలో 15863 మంది పరీక్షకు హాజరుకాగా 15,176 మంది అర్హత సాధించారు. బాలికల భాగంలో 18268 మంది పరీక్ష కు హాజరవగా 17543 మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. . ఐసెట్ ప్రవేశ పరీక్షలో 95.86% మంది ఉతీర్ణత సాధించారు. పరీక్షా రాసిన వారిలో పురుషుల్లో 95.66% మంది , మహిళల్లో 96.03% మంది ఉతీర్ణత సాధించారు.
ర్యాంకర్లు వీరే...
ఐసెట్ 2025 ప్రవేశ పరీక్షలు విశాఖ నగరానికి చెందిన మనోజ్ మేక ప్రధమ ర్యాంకును సాధించారు. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన డి.సందీప్ రెడ్డి రెండవ ర్యాంకును, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.కృష్ణ సాయి మూడవ ర్యాంకును, హైదరాబాదుకు చెందిన వి. సాయిరాం సాత్విక్ నాలుగవ ర్యాంకును, గుంటూరుకు చెందిన ఆర్. మాధుర్య ఐదవ ర్యాంకును సాధించారు. విద్యార్థులను
అభినందించిన మంత్రి నారా లోకేష్..
ఐసెట్ ప్రవేశ పరీక్షకు హాజరై అర్హత సాధించిన విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. పరీక్షా ఫలితాలను cets.apsche.ap.gov.in/ICET వెబ్సైట్లో పొందుపరిచామని, వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 నుంచి పొందవచ్చునని తెలిపారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు సాకారం కావాలని మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి