న్యాయ శాస్త్రంలో హరితకు డాక్టరేట్
న్యాయ శాస్త్రంలో హరితకు డాక్టరేట్
ఆంధ్ర విశ్వకళాపరిషత్, “డా॥ బి. ఆర్. అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా” విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని లంకె హరిత ‘ఫర్ఫార్మెన్స్ ఎవాల్యూయేషన్ ఆఫ్ “ఆహార భద్రత :- కోవిడ్-19 ప్రభావంపై సామాజిక ఆర్థిక మరియు చట్టపరమైన దృక్పథాలు (ఒక అనుభవిక అధ్యయనం, పాకిస్థాన్ మరియు శ్రీలంకకు ప్రత్యేక సూచన) అనే అంశంపై న్యాయ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్, హానరరీ ప్రొఫెసర్ వి.విజయలక్ష్మి పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను 'డా॥ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) పట్టాను సాధించారు. గౌరవ వైస్ చాన్సలర్ జి.పి.రాజశేఖర్ చేతులమీదుగా లంకె హరిత డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
ఈ సందర్భంగా పర్యవేక్షకులు, బోధనా సిబ్బంది, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. తన ఈ విజయాన్ని తాతగారు, నాన్నమ్మ, తల్లిదండ్రులు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, చిన్నాన్న, పిన్నిలు, మేనమామ, అత్త, అన్నయ్యలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెలు, బావ గారు, భర్త మరియు కుమారునికి పి.హెచ్.డి డాక్టరేట్ డిగ్రీని అంకితం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి