విశాఖ నగరానికే వన్నెతెచ్చారు...

 క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలవడుతుంది
- క్రీడలకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది 
- ప్రపంచ పటంలో క్రీడల్లో విశాఖ తన స్థానం పదిలం

విశాఖపట్నం మే 31: 

క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలబడుతుందని తద్వారా వారు సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని పలువురు శాసనసభ్యులు అన్నారు. శనివారం సాయంత్రం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీగా ఎంపికైన డాక్టర్ డి. భగీరథ కుమార్, ఐ సి ఏ ఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.ప్రసన్న కుమార్ ల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యుల గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. ప్రపంచ పటంలో క్రీడల్లో విశాఖ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది అని అన్నారు. యువత విద్యతోపాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. తద్వారా రాష్ట్రానికి, దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం సాధ్యపడుతుందని అన్నారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్నకుమార్ లు జాతీయస్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం నగరానికి ఎంతో గర్వకారణం అని అన్నారు.

 విశాఖ నగరానికి, తాము చేపట్టిన పదవులకు మరింత పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని పలాస శాసన సభ్యురాలు గౌతు శిరీష అన్నారు. ఉన్నతంగా ఎదిగిన ఇటువంటి వ్యక్తులను సన్మానం చేయడం వలన చిన్నారుల్లో స్ఫూర్తిని పెంపొందించడం సాధ్యపడుతుందని అన్నారు. చిన్నారుల విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉంటుందన్నారు. అనంతరం భగీరథ కుమార్, ప్రసన్న కుమార్ లను సత్కరించారు.

ఈ విజయ వెనక ఎంతో కష్టం దాగి ఉందని ఆర్ఎస్ఎఫ్ఐ జనరల్ సెక్రటరీ, సన్మాన గ్రహీత డాక్టర్ భగీరథ కుమార్ అన్నారు. ఒక మంచి బృందాన్ని తయారు చేసుకుని పని చేస్తే విజయం తప్పక లభిస్తుందని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. క్రీడలను మరింత అభివృద్ధి చేసేదిశగా కృషి చేస్తానని అన్నారు.

కార్యక్రమంలో విశాఖ జిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ చంద్ర, కార్యదర్శి శీలం లక్ష్మణ్, ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి తామస్ అయ్య, కళాభారతి కార్యదర్శి డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న