హ్యూమన్ జెనెటిక్స్ లో నాగసుధ మయురికి డాక్టరేట్
హ్యూమన్ జెనెటిక్స్ లో నాగసుధ మయురికి డాక్టరేట్
ఆంధ్ర విశ్వ కళా పరిషత్ సైన్స్ కళాశాల పరిధిలోని హ్యూమన్ జెనెటిక్స్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని నాగసుధ మయూరి మట్టపర్తి కి డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు వి.లక్ష్మి పర్యవేక్షణలో జెనెటిక్ ఎపిడిమాలజీ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ ఇన్ విశాఖపట్నం రీజియన్ అనే అంశంపై జరిపిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది.
ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను నాగసుధ మయూరి స్వీకరించారు. తన పరిశోధనలో భాగంగా ఫ్యాటీ లివర్ కి అనారోగ్యకర జీవనశైలితో పాటు జన్యువులు కూడా ముఖ్య కారణంగా నిలుస్తున్నాయని గుర్తించారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించగలిగితే వ్యాధి తీవ్రతను నివారించడం సాధ్యపడుతుందని వివరించారు. తన పరిశోధన విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన తన తండ్రికి, తన గురువు ఆచార్య వి.లక్ష్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మయూరిని విభాగ ఆచార్యులు పరిశోధకులు సిబ్బంది అభినందించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి