ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 90.83 శాతం హాజరు

 ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 90.83 శాతం హాజరు నమోదు

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన సంయుక్త ప్రవేశ పరీక్ష ఏపీ ఐసెట్ 2025 ప్రశాంతంగా ముగిసింది. బుధవారం రెండు సెషన్లుగా జరిగిన ఈ పరీక్షకు 37572 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 34131 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 3441 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్ కి90.15 శాతం మంది హాజరవుగా, మధ్యాహ్నం సెషన్ కి 91.52 శాతం మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్రా ష్ట్రంతో పాటు, హైద్రాబాద్ కేంద్రంతో కలుపుకొని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఎం శశి తెలిపారు. ఉదయం నిర్వహించిన మొదటి సెషన్ పరీక్ష సెట్ కోడ్ ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ విడుదల చేయగా, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్ష సెట్ కోడ్ ఏయూ రిజిస్ట్రార్ఆ చార్య ఇ.ఎన్ ధనంజయ రావు విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న