పోస్ట్‌లు

జులై, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

Ph .D Awarded to Nookala R.L.L. Soujanya

చిత్రం
Ph .D  Awarded to Nookala R.L.L.  Soujanya  Ph .D Doctorate Awarded to Nookala R.L.L.  Soujanya,  a research scholar from the Department of Education in Andhra University, has been awarded a doctorate degree. Her research, conducted under the able guidance and  supervision of Professor T. Sharon Raju garu, Head, Departmentof Education AU . Her research work  entitled on " Effectiveness on the implementation of Educational Programmes at School Level – A perceptual study." Soujanya received the Phd award on the  hands of  Andhra University Vice-Chancellor sir  Professor G.P. Rajasekhar garu . Soujanya's Phd awarded for her research into how the  Educational  related Programmes and Schemes implemented by Government of Andhra Pradesh to  contribute to strengthening the education system at the school level and how they benefit the  studentsas a whole.  As part of her research, she conducted an extensive study and...

విద్యా విభాగం పరిశోధకురాలు నూకల ఆర్.ఎల్.ఎల్ సౌజన్యకు డాక్టరేట్

చిత్రం
  విద్యా విభాగం పరిశోధకురాలు  నూకల ఆర్.ఎల్.ఎల్ సౌజన్యకు డాక్టరేట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగం పరిశోధకురాలు నూకల ఆర్.ఎల్.ఎల్ సౌజన్యకు డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు ఆచార్య టి. షారోన్ రాజు పర్యవేక్షణలో పాఠశాల స్థాయిలో విద్యాసంబంధిత పథకాలు– సమర్థవంతమైన అమలు అనే అంశంపై జరిపిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ చేతుల మీదుగా డాక్టరేట్ ఉత్తర్వలను సౌజన్య అందుకున్నారు.  పాఠశాల స్థాయిలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి విద్యా సంబంధిత పథకాలు, విద్యార్థులకు ఏ ఏ విధంగా దోహదకారిగా నిలుస్తున్నాయి అనే అంశంపై జరిపిన పరిశోధనకు గాను సౌజన్యకు డాక్టరేట్ లభించింది. తన పరిశోధనలో భాగంగా ప్రభుత్వాలు అందిస్తున్న విద్యా సంబంధిత పథకాలపై విస్తృత అధ్యయనం, విశ్లేషణ చేయడం జరిగింది. ప్రభుత్వ విద్యా సంబంధిత సంక్షేమ పథకాల అమలకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగంగా నిలవనుంది. విద్యా సంబంధిత సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేయడానికి, బలోపేతం చేస్తూ విద్యార్థులకు చేరువ చేయడానికి అవసరమైన సూచనలను తన పరిశోధనలో సౌజన్య అందించడం జరిగింది.  ఈ సందర్భంగా ఆమెను వ...

Doctorate awarded by Andhra University

చిత్రం
                       Doctorate awarded by Andhra University  Mrs. Hepsiba Seeli has successfully completed her Doctorate under the esteemed guidance of Prof. V.V.S. Prasad, Chairman, Board of Studies, Marine Engineering, Andhra University College of Engineering. Her research, titled "Fabrication, Testing, Optimization and Microwave Absorption of Graphene/ Aluminum Reinforced Polymer Composites", focuses on the development and optimization of lightweight, multi-layered Nano-graphene/ E-glass fibre radar-absorbing structures. These advanced composites exhibit superior EMI shielding and X-band microwave absorption, making them highly suitable for applications in stealth, marine, and electronic systems. Mrs. Hepsiba Seeli has published her research findings in a reputed international journal, secured a patent for her innovative work, and presented her contributions at international conferences. On this occasion, sh...

హెప్సిబా సీలి కి ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్

చిత్రం
హెప్సిబా సీలి కి ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్ హెప్సిబా సీలి కి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, మెరైన్ ఇంజినీరింగ్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.వి.ఎస్. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తన డాక్టరేట్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె పరిశోధన శీర్షిక "Fabrication, Testing, Optimization and Microwave Absorption of Graphene/Aluminum Reinforced Polymer Composites" లో, తేలికపాటి, బహుస్తర నానో గ్రాఫిన్/ఈ-గ్లాస్ ఫైబర్ ఆధారిత రాడార్ శోషణ నిర్మాణాల అభివృద్ధి మరియు ఆప్టిమైజేషన్ పై కేంద్రీకృతమైంది. ఈ అధునాతన కాంపోజిట్లు అధిక స్థాయిలో EMI షీల్డింగ్ మరియు X-band మైక్రోవేవ్ అబ్జార్ప్షన్ లక్షణాలను చూపిస్తూ, స్టెల్త్, మెరైన్ మరియు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి అనేక అనువర్తనాలకు అర్హత పొందాయి.  హెప్సిబా సీలి తన పరిశోధన ఫలితాలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌లలో ప్రచురించడమే కాకుండా, తన ఆవిష్కరణలకు పేటెంట్‌లు పొందారు. ఆమె పరిశోధనలోని ప్రాధాన్యతను అనేక అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలుగా ప్రచురించారు  ఈ సందర్బంగా, పరిశోధన అవకాశాన్ని కల్పించినందుకు ఆంధ్రా యూనివర్సిటీ అధికారులకు ఆమె తన కృతజ...

Divi's Laboratories Donates ₹3.21 Crores infrastructure under CSR

చిత్రం
 Divi's Laboratories Donates ₹3.21 Crores infrastructure under CSR Funds to Andhra University – Chemistry Laboratory-2 Modernized with ₹49.96 Lakhs  – 72 RO Water Plants Donated at a Cost of ₹2.36 Crores  – Chemistry Laboratory-1 Modernized Earlier with ₹36 Lakhs – Supporting for Infrastructure Development Andhra University, July 24: Divi's Laboratories Limited, a leading pharmaceutical company, has provided financial assistance worth ₹3.21 crores to Andhra University. In a program held on Wednesday afternoon, Chemistry Laboratory-2, modernized at a cost of ₹49.96 lakhs, was jointly inaugurated by AU Vice-Chancellor Professor G.P. Rajasekhar, along with Dr. L.V. Ramana, Vice President of Divi's Laboratory, and Y.S. Koteswara Rao, General Manager of Divi's Laboratory. The Chemistry Laboratory has been fully modernized at a cost of ₹49.96 lakhs. A few months ago, Chemistry Laboratory-1 was also modernized and provided at a cost of ₹36 lakhs. These laboratories have been d...

ఏయూకి దివీస్ లేబరేటరీ 3.21 కోట్ల సి.ఎస్.ఆర్ నిధుల సహాయం

చిత్రం
  దివీస్ లేబరేటరీ 3.21 కోట్ల సి.ఎస్.ఆర్ నిధుల సహాయం  – 49.96 లక్షలతో కెమిస్ట్రీ లేబరేటరీ-2 ఆధునీకరణ  – 2.36 కోట్ల వ్యయంతో 72 ఆర్వో వాటర్ ప్లాంట్ల బహుకరణ  -గతంలో 36 లక్షలతో కెమిస్ట్రీ లేబరేటరీ-1 ఆధునీకరణ -మౌళిక వసతుల కల్పనలో తోడ్పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 24:  ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఫార్మసీ సంస్థ దివీస్ లేబరేటరీ లిమిటెడ్ 3.21 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించింది. బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో 49.96 లక్షలతో ఆధుననీకరించిన కెమిస్ట్రీ లేబరేటరీ-2 ని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ తో కలిసి దివీస్ లాబరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్.వి రమణ, దివీస్ లేబరేటరీ జనరల్ మేనేజర్ వై.ఎస్ కోటేశ్వరరావులు సంయుక్తంగా ప్రారంభించారు. రసాయన శాస్త్ర ప్రయోగశాలను 49.96 లక్షల వ్యయంతో పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. కొద్ది నెలల క్రితం 36 లక్షల వ్యయంతో కెమిస్ట్రీ లేబరేటరీ–1 ని కూడా ఆధునీకరించి అందించింది. పీజీ విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా ఈ ప్రయోగశాలను తీర్చిదిద్దారు. ప్రయోగశాలలో అవసరమైన ఫ్లూమింగ్ ఛాంబర్, డ్రై ఒవేన్, వాక్యూ...

ఏయూలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్సు

చిత్రం
  ఏయూలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్సు   ఈ ఏపీ సెట్ ద్వారా అడ్మిషన్లు  - మొదటి సంవత్సరం 30 మందికి ప్రవేశాలు   - ఆమోదం తెలిపిన ఏయు అకడమిక్ సెనేట్    ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్స్ కి సెనేట్ ఆమోదం తెలిపింది. ఈరోజు నిర్వహించిన అకడమిక్ సెనేట్ సమావేశంలో సభ్యులు నూతన కోర్సు ప్రారంభించడానికి ఆమోదాన్ని అందించారు. ఈ కోర్సులో ప్రవేశాలను ఈ ఏపీ సెట్ ద్వారా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ కళాశాలలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం నుంచి నిర్వహించే కోర్సులో తొలి బ్యాచ్లో 30 మందికి ప్రవేశాన్ని కల్పిస్తారు. ఈ కోర్సు కు సంబంధించిన సబ్జెక్టులను కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ తదితర విభాగాల ఆచార్యులు నిపుణులు బోధన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా అతికొద్ది విశ్వవిద్యాలయాలలో నిర్వహిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ కోర్సును ఆంధ్ర విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులల...

ఫార్మసీ విద్యార్థినులకు అధునాతన వాష్ రూమ్స్

చిత్రం
  ఫార్మసీ విద్యార్థినులకు అధునాతన వాష్ రూమ్స్  – నిర్మించి అందించిన పూర్వ విద్యార్థి దేవా పురాణం –వర్సిటీకి నిరంతర సహాయం అందిస్తున్న పూర్వ విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల విద్యార్థులకు అధునాతన వాష్ రూమ్స్ సమకూరాయి. బుధవారం ఉదయం ఫార్మసీ కళాశాల భవనంలో నూతనంగా నిర్మించిన వాష్ రూమ్స్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏయూ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ దేవా హెచ్ పురాణం తన సొంత నిధులతో తాను చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంకు సహాయాన్ని అందిస్తూ వీటిని నిర్మించారు. తన సొంత నిధులు దాదాపు 15 లక్షల రూపాయలు వెచ్చించి అధునాతన రీతిలో వీటిని నిర్మించి ఫార్మసీ కళాశాలకు అందజేశారు. తన తల్లిదండ్రులు శ్రీమతి లలితాదేవి పురాణం శ్రీ కోటిలింగాల మూర్తి పురాణం పేరు మీదుగా విశ్వవిద్యాలయంలో నిరంతరం విద్యార్థినులకు ఉపయుక్తంగా అనేక కార్యక్రమాలను దేవా పురాణం నిర్వహిస్తున్నారు. గతంలో ఫార్మసీ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి లేదనే విషయాన్ని తెలుసుకుని నూతన హాస్టల్ నిర్మాణానికి అవసరమైన నిధులను అందించి తొలిసారిగా ఫార్మసీ విద్యార్థులకు ఒక అధునాతన హాస్టల్ నిర్మించి అందజేశారు. అనంతరం...

హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

చిత్రం
ఆర్థిక మంత్రిత్వ శాఖ హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ భారత ప్రభుత్వ  ఆర్థిక మంత్రిత్వ శాఖ హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్  నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గజట్ లో ప్రకటించింది. ఆర్ధిక మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సంఘం లో యార్లగడ్డ మూడు సంవత్సరాలు సేవలు అందిస్తారు. మంత్రిత్వశాఖ లో రాజభాష హిందీ కి సంబంధించి ఆయనసలహాలు ఇస్తారు.

విద్యార్థులకు వ్యాసరచన- వక్తృత్వ పోటీలు నిర్వహణ

చిత్రం
విద్యార్థులకు వ్యాసరచన- వక్తృత్వ పోటీలు నిర్వహణ       ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జనాభా పరిశోధన కేంద్రం (పాపులేషన్ రీసెర్చ్ సెంటర్), స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఆంధ్ర విశ్వ విద్యాలయం సంయుక్తంగా 'ప్రపంచ జనాభా దినోత్సవం' పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు, అదేవిధంగా విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలలు, విభాగాలకు చెందిన డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు ఈరోజు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ కళాశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ హానరరీ డైరెక్టర్ మరియు స్టాటస్టిక్స్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి. మునిస్వామి, రీసెర్చ్ సెంటర్ స్టాప్ డాక్టర్ వై. రమణ, డాక్టర్ సిహెచ్. పాదాలు, డాక్టర్ టి. శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈ నెల 11వ తేదీన నిర్వహించే ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమంలో బహుమతులను, ప్రశంసా పత్రాలను ప్రధానం చేస్తారు.

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

చిత్రం
  విద్యలో నాణ్యత పెంపొందించే దిశగా పనిచేయాలి   పరీక్షలు నిర్వహణ పటిష్టంగా జరపాలి  పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు   శతాబ్ది ఉత్సవాలలో భాగంగా అనుబంధ కళాశాలల ఫ్యాకల్టీకి ఎఫ్.డి.పి లు   అనుబంధ కళాశాలలతో ఏయూ రూరల్ అవుట్ రీచ్ కార్యక్రమాలు   ఫ్యాకల్టీ, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు విద్యలో నాణ్యతను మరింత పెంపొందించే దిశగా అనుబంధ కళాశాలలు, విశ్వవిద్యాలయంతో కలిసి ముందుకు సాగాలని ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం కన్వెన్షన్ సెంటర్లో ఏయు అనుబంధ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్ తో నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సక్రమంగా, పటిష్టంగా జరగాలని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా తాను కొన్ని లోపాలను గుర్తించానని వీటన్నిటికీ పరిష్కారాలను చూపిస్తున్నట్లు చెప్పారు.  పరీక్షల నిర్వహణలో అలసత్వం వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరీక్షా కేంద్రం రద్దు చేయడమే కాకుండా, కళాశాల గుర్తింపును కూడా రద్దు చేయడానికి...

జేమ్స్ స్టీఫెన్ కు గ్లోబల్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు

చిత్రం
 జేమ్స్ స్టీఫెన్ కు గ్లోబల్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్  ప్రొఫెసర్ మేకా జేమ్స్ స్టీఫెన్, పోలాండ్‌లోని బైడ్‌గోస్జ్చ్‌లోని WSG యూనివర్సిటీలో జరిగిన ప్రతిష్టాత్మక స్ప్రింగర్ అంతర్జాతీయ సదస్సు "నెట్‌వర్కింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఎక్స్‌పర్ట్ అప్లికేషన్స్ అండ్ సెక్యూరిటీ" (NICE-TEAS 2025)లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. సాంకేతికత, భద్రత, సామాజిక అనువర్తనాలలో అభివృద్ధి చెందుతున్న పోకడలపై  ప్రపంచం నలుమూలల నుండి నిపుణులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు సదస్సులో పాల్గొన్నారు. పరిశోధన, సామాజిక ఆవిష్కరణలకు చేసిన కృషికి గుర్తింపుగా, ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్ కు ప్రతిష్టాత్మకమైన నెక్సస్ సినర్జీ అవార్డ్స్, 2025 లో  "గ్లోబల్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు" ను ఈ సరస్సులో ప్రధానం చేశారు. క్రమంలో ప్రొఫెసర్ మేకా జేమ్స్ స్టీఫెన్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్ చేపట్టిన పరిశోధనా కార్యక్రమాలను, ముఖ్యంగా "కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ అక్షరాస్యత వేదిక ద్వారా అట్టడుగు వర్గాలకు సాధికారత" అనే ప్రధాన ప్ర...

Honored with the "Global Research Excellence Award

చిత్రం
  James Stephen was honored with the  "Global Research Excellence Award Professor Meka James Stephen Featured as Keynote Speaker at NICE-TEAS 2025  Professor Meka James Stephen, Chair Professor of the Dr. B.R. Ambedkar Chair at Andhra University, distinguished scholar and social innovator, participated as a keynote speaker at the prestigious Springer International Conference, "Networking International Conference on Emerging Trends in Expert Applications and Security" (NICE-TEAS 2025) held at WSG University, Bydgoszcz, Poland. The conference brought together leading scholars, researchers, and industry experts from around the globe to deliberate on emerging trends in technology, security, and social applications. During the event, Professor Meka delivered a compelling keynote address highlighting the groundbreaking research initiatives undertaken by the Dr. B.R. Ambedkar Chair, notably the flagship project titled “ Empowering Underserved Communities through an AI-Po...

Social Media is an effective medium

చిత్రం
 Social Media is an effective medium – Youth Should be aware of new Technologies  – We're Living in a Technological Era Visakhapatnam, July 1: Social media is functioning effectively in the modern era, it is an effective medium said Dr. A. Narasimha Rao, Principal of AU College of Arts and Commerce. He participated in the closing ceremony of two-week hands on training & certificate course on Web Development training program organized under the Dr B.R.Ambedkar Chair of Andhra University on Tuesday and distributed certificates to the students. On this occasion, Dr. A. Narasimha Rao emphasized that youth should be aware of rapidly changing technologies. He reminded that today's generation is living and progressing in an age dominated by technology. Programs like these help in acquiring and enhancing new knowledge, he added. He further stated that Andhra University is emerging as one of the top universities in the country. Dr. K. Seetha Manikyam, Principal, Dr B.R.Ambedkar Law...

యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

చిత్రం
  సామాజిక మాధ్యమాలు ప్రభావంతంగా పనిచేస్తున్నాయి  – యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి  – సాంకేతిక యుగంలో పయనిస్తున్నాం విశాఖపట్నం జూలై 1:  ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఏయూ ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.నరసింహారావు అన్నారు. మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు వారాల వెబ్ డెవలప్మెంట్ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ. నరసింహారావు మాట్లాడుతూ శరవేగంగా మార్పు చెందుతున్న సాంకేతికతలపై యువత అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నేటితరం సాంకేతికత యుగంలో ప్రయాణిస్తోందని అనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల వలన నూతన జ్ఞానాన్ని అందించడం, జ్ఞానాన్ని పెంపొందించడం సాధ్యపడుతుందని తెలిపారు. దేశంలో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తోందని అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్  న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం మాట్లాడుతూ ఇటువం...