యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

 సామాజిక మాధ్యమాలు ప్రభావంతంగా పనిచేస్తున్నాయి 
– యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి 
– సాంకేతిక యుగంలో పయనిస్తున్నాం

విశాఖపట్నం జూలై 1: 

ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఏయూ ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.నరసింహారావు అన్నారు. మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు వారాల వెబ్ డెవలప్మెంట్ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ. నరసింహారావు మాట్లాడుతూ శరవేగంగా మార్పు చెందుతున్న సాంకేతికతలపై యువత అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నేటితరం సాంకేతికత యుగంలో ప్రయాణిస్తోందని అనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల వలన నూతన జ్ఞానాన్ని అందించడం, జ్ఞానాన్ని పెంపొందించడం సాధ్యపడుతుందని తెలిపారు. దేశంలో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తోందని అన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలకు తమ కళాశాల విద్యార్థులకు సైతం అవకాశం ఇవ్వాలని సూచించారు. అంబేద్కర్ చైర్ ఆధ్వర్యంలో యువతకు ఉపయుక్తంగా నిలిచే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రశంసించారు. 

అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ మాట్లాడుతూ విద్యార్థులకు నూతన నైపుణ్యాలను అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నిర్వహించామని అన్నారు. విద్యార్థులు చదువుతూ తమ స్వశక్తితో ఎదిగే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం నిలిచిందని చెప్పారు. రెండు వారాల శిక్షణ ముగించుకున్న విద్యార్థులు సొంతంగా వెబ్ డిజైనింగ్ చేసే సామర్థ్యాన్ని పొందారని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 55 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న