విద్యార్థులకు వ్యాసరచన- వక్తృత్వ పోటీలు నిర్వహణ
విద్యార్థులకు వ్యాసరచన- వక్తృత్వ పోటీలు నిర్వహణ
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జనాభా పరిశోధన కేంద్రం (పాపులేషన్ రీసెర్చ్ సెంటర్), స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఆంధ్ర విశ్వ విద్యాలయం సంయుక్తంగా 'ప్రపంచ జనాభా దినోత్సవం' పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు, అదేవిధంగా విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలలు, విభాగాలకు చెందిన డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు ఈరోజు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ కళాశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ హానరరీ డైరెక్టర్ మరియు స్టాటస్టిక్స్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి. మునిస్వామి, రీసెర్చ్ సెంటర్ స్టాప్ డాక్టర్ వై. రమణ, డాక్టర్ సిహెచ్. పాదాలు, డాక్టర్ టి. శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈ నెల 11వ తేదీన నిర్వహించే ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమంలో బహుమతులను, ప్రశంసా పత్రాలను ప్రధానం చేస్తారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి