జేమ్స్ స్టీఫెన్ కు గ్లోబల్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు
జేమ్స్ స్టీఫెన్ కు గ్లోబల్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ మేకా జేమ్స్ స్టీఫెన్, పోలాండ్‌లోని బైడ్‌గోస్జ్చ్‌లోని WSG యూనివర్సిటీలో జరిగిన ప్రతిష్టాత్మక స్ప్రింగర్ అంతర్జాతీయ సదస్సు "నెట్‌వర్కింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఎక్స్‌పర్ట్ అప్లికేషన్స్ అండ్ సెక్యూరిటీ" (NICE-TEAS 2025)లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. సాంకేతికత, భద్రత, సామాజిక అనువర్తనాలలో అభివృద్ధి చెందుతున్న పోకడలపై ప్రపంచం నలుమూలల నుండి నిపుణులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు సదస్సులో పాల్గొన్నారు.
పరిశోధన, సామాజిక ఆవిష్కరణలకు చేసిన కృషికి గుర్తింపుగా, ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్ కు ప్రతిష్టాత్మకమైన నెక్సస్ సినర్జీ అవార్డ్స్, 2025 లో "గ్లోబల్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు" ను ఈ సరస్సులో ప్రధానం చేశారు.
క్రమంలో ప్రొఫెసర్ మేకా జేమ్స్ స్టీఫెన్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్ చేపట్టిన పరిశోధనా కార్యక్రమాలను, ముఖ్యంగా "కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ అక్షరాస్యత వేదిక ద్వారా అట్టడుగు వర్గాలకు సాధికారత" అనే ప్రధాన ప్రాజెక్టుపై ముఖ్య ప్రసంగం చేశారు. ఈ ప్రాజెక్ట్ గ్రామీణ, అట్టడుగు వర్గాల ప్రజలను డిజిటల్‌గా అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించి అక్షరాస్యత మరియు సామాజిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తోంది. దీనిలో అభివృద్ధి చేయబడిన ఒక నమూనా అప్లికేషన్ విశాఖజిల్లా లోని పెందుర్తి మండలంలో ఐదు గ్రామాలలో విజయవంతంగా అమలు చేశారు.
సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలందరికీ సమాన అవకాశాలపై దృష్టి సారించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శాలకు అనుగుణంగా, సాంకేతికత సహకారంతో సామాజిక ఉన్నతికి శక్తివంతమైన సాధనాలుగా ఎలా ఉపయోగపడతాయో ప్రొఫెసర్ స్టీఫెన్ తెలియజేశారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి