విద్యా విభాగం పరిశోధకురాలు నూకల ఆర్.ఎల్.ఎల్ సౌజన్యకు డాక్టరేట్
విద్యా విభాగం పరిశోధకురాలు
నూకల ఆర్.ఎల్.ఎల్ సౌజన్యకు డాక్టరేట్
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగం పరిశోధకురాలు నూకల ఆర్.ఎల్.ఎల్ సౌజన్యకు డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు ఆచార్య టి. షారోన్ రాజు పర్యవేక్షణలో పాఠశాల స్థాయిలో విద్యాసంబంధిత పథకాలు– సమర్థవంతమైన అమలు అనే అంశంపై జరిపిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ చేతుల మీదుగా డాక్టరేట్ ఉత్తర్వలను సౌజన్య అందుకున్నారు.
పాఠశాల స్థాయిలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి విద్యా సంబంధిత పథకాలు, విద్యార్థులకు ఏ ఏ విధంగా దోహదకారిగా నిలుస్తున్నాయి అనే అంశంపై జరిపిన పరిశోధనకు గాను సౌజన్యకు డాక్టరేట్ లభించింది. తన పరిశోధనలో భాగంగా ప్రభుత్వాలు అందిస్తున్న విద్యా సంబంధిత పథకాలపై విస్తృత అధ్యయనం, విశ్లేషణ చేయడం జరిగింది. ప్రభుత్వ విద్యా సంబంధిత సంక్షేమ పథకాల అమలకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగంగా నిలవనుంది. విద్యా సంబంధిత సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేయడానికి, బలోపేతం చేస్తూ విద్యార్థులకు చేరువ చేయడానికి అవసరమైన సూచనలను తన పరిశోధనలో సౌజన్య అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెను విభాగ ఆచార్యులు పరిశోధకులు అభినందించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి