పోస్ట్‌లు

ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’ ప్రారంభం

చిత్రం
  ఓయాసిస్ ఫెర్టిలిటీ — విశాఖపట్నం నుండి ‘ జనని యాత్ర ’ ప్రారంభం   సమాజంలో ఫెర్టిలిటీ అవగాహన పెంచే ఉద్యమం విశాఖపట్నం , 24 నవంబర్ 2025: తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది జంటలకి ఆశను కల్పించి , అవగాహనను పెంచిన తర్వాత , భారతదేశంలో 16 సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఓయాసిస్ ఫెర్టిలిటీ , రెండో విడత ‘ ఓయాసిస్ జనని యాత్ర ’ అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని 24 నవంబర్ 2025 న విశాఖపట్నం నుండి ప్రారంభించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా   ఎమ్మెల్యే   గంటా శ్రీనివాస్ గారు మరియు , ఎమ్మెల్యే   వంశీ    కృష్ణ‌  శ్రీనివాస్ గారు , అలాగే ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు . ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకు ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి , తల్లిదండ్రులవాలనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేయడమే లక్ష్యం తో ప్రారంభమైంది . ఆంధ్రప్రదేశ్ ‌ లో ఫెర్టిలిటీ రేటు 1.5 కి పడిపోవడం , ఇది 2.1 రీప్లేస్ ‌ మెంట్ స్థాయికి చాలా తక్కువ , ఈ ...

మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్‌

చిత్రం
  మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్‌ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం మెరైన్ ఇంజ‌నీరింగ్ విభాగ ప‌రిశోధ‌క విద్యార్థి మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్ ల‌భించింది. విభాగ ఆచార్యులు వి.వి.ఎస్. ప్రసాద్ మార్గదర్శకత్వంలో  "కంప్యూటేషనల్ అండ్ ఎక్సపెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎన్ యానులర్ కుకింగ్ బౌల్ ఫర్ నాన్-సెంట్రిఫ్యూగల్ కేన్ షుగర్ యూనిట్ యూజింగ్ ఫుడ్-గ్రేడ్ ఆయిల్ అండ్ గ్రాఫిన్ నానోప్లేట్ లెట్ డిస్ఫర్షన్స్"  అంశంపై చేసిన పరిశోదన కు డాక్ట‌రేట్ ల‌భించింది. సాంప్ర‌దాయ విధానంలో చెరుకు పిప్పిని మండించి బెల్లం త‌యారీ జ‌రుపుతుంటారు. దీనికి ప్ర‌త్యామ్నాయ విధానాన్ని ప‌ర్య‌వార‌ణ‌హిత సాంకేతిక‌త‌ల‌ను అభివృద్ధి చేసారు. మొహమ్మద్ అబ్దుల్ రజాక్ తన పరిశోధన ఫలితాలను నాలుగు ప్రఖ్యాత అంతర్జాతీయ జ‌ర్న‌ల్స్‌లో ప్రచురించారు. ఏయూ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్  నుంచి డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను ఆయ‌న స్వీక‌రించారు.   మెరైన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు, కుటుంబ స‌భ్య‌లు అభినందనలు తెలిపారు. ప్ర‌స్తుతం అబ్దుల్ ర‌జాక్ గీతం విశ్వ‌విద్యాల‌యంలో ప‌నిచేస్తున్నారు.

లమ్మత ఆశిష్ కుమార్ న్యాయ‌శాస్త్రంలో డాక్ట‌రేట్

చిత్రం
 లమ్మత ఆశిష్ కుమార్ న్యాయ‌శాస్త్రంలో డాక్ట‌రేట్ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, అక్టోబ‌ర్ 30: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం న్యాయ క‌ళాశాల ప‌రిశోధ‌క విద్యార్థి ల‌మ్మ‌త ఆశిష్ కుమార్ కు డాక్ట‌రేట్ ల‌భించింది. న్యాయ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  "కన్వర్జింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్: ఎ గ్లోబల్ పెర్స్పెక్టివ్ ఆన్ యాజమాన్య మరియు లయబిలిటీ కాన్‌డ్రమ్" అనే అంశంపై జ‌రిపిన‌ పరిశోధనను డాక్ట‌రేట్ ల‌భించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో ఆశిష్ కుమార్‌కు ఉత్తర్వులు అంద‌జేసి అభినందించారు. కృత్రిమ మేధ ఉప‌యోగించిన త‌యారు చేసిన‌, అభివృద్ధిచేసిన స‌మాచారం, జ్ఞానానికి సంబంధించిన హ‌క్కుల‌ను ఎవ‌రికి ఇవ్వాలి అనే అంశంపై అధ్య‌య‌నం చేశారు. వివిధ దేశాల‌లో దీనికి సంబంధించి చ‌ట్టాలు, వాటి ప‌నితీరు, ప‌రిధిని త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా అధ్య‌య‌నం చేశారు. ఆయన పరిశోధన కృత్రిమ మేధస్సు మరియు మేధో సంపత్తి హక్కుల మధ్య అభివృద్ధి చెందుతున్న ఇంటర్‌ఫేస్‌ను విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది, ప్రపంచ న్యాయ శాస్త్రం, శాసన మరియు విధాన దృక్పథాలపై దృష్టి పెడు...

గూగుల్ విశాఖ‌కు రావ‌డం అభివృద్దికి ఉప‌యుక్తం

చిత్రం
 విశాఖ న‌గ‌రం ఐటి రాజ‌ధానిగా అవ‌త‌రిస్తుంది భ‌విష్య‌త్తులో విశాఖ న‌గ‌రం ఐటి, ఏఐ రాజ‌ధానిగా అవ‌త‌రిస్తుంద‌ని విశాఖ జిల్లా బి.సి వెల్ఫేర్ ఫెడ‌రేష‌న్ అద్య‌క్షుడు మండెం సుభాష్ చంద్ర‌బోస్ అన్నారు.  విశాఖ న‌గ‌రంలో గూగుల్ డేటా సెంట‌ర్ ఏర్పాటు స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. ఇటువంటి సంస్థ‌లు విశాఖ‌కు రావ‌డం వ‌ల‌న అనుబంధంగా అనేక సంస్థ‌లు విశాఖ‌కు వ‌స్తాయ‌న్నాత‌రు. త‌ద్వారా ఉపాధి అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా పెరుగుతాయ‌న్నారు. శ‌నివారం ఏయూలోని మ‌హ‌త్మ జ్యోతిరావు ఫూలే విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సుభాష్ చంద్ర‌బోస్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాలలో  భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపే దిశ‌గా,  కూటమి ప్రభుత్వం  విశాఖ నగరంలో గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలను తేవడం జ‌రిగింద‌న్నారు. దీనికి స‌హ‌క‌రించిన‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడుకి, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య విలువలు, పరిపాలన స...

ఆచార్య ల‌లిత భాస్క‌రికి విద్య‌ర‌త్న పుర‌స్కారం

చిత్రం
 ఆచార్య ల‌లిత భాస్క‌రికి విద్య‌ర‌త్న పుర‌స్కారం ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, అక్టోబ‌ర్ 25 : ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డి.లలిత భాస్కరి కి విద్యారత్న పురస్కారం లభించింది. హైదరాబాదులోని టీ హబ్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో భారత్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్‌ అవార్డు- 2025 ల‌ వేడుకల్లో భాగంగా ఏఐసిటిఈ సి.ఓ.ఓ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్, జెఎన్‌టియూ కాకినాడ వీసీ ఆచార్య సి.వి.ఆర్.కె.ప్రసాద్ లు ఈ పురస్కారాన్ని లలిత భాస్కరి కి అందించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య ల‌లిత భాస్క‌రిని ఏయూ ఆచార్యులు, అధికారులు అభినందించారు.

ప్రాణాలను రక్షించే విద్య సిపిఆర్

చిత్రం
  ప్రాణాలను రక్షించే విద్య సిపిఆర్   ఏయూ హెల్త్ సెంటర్లో సిపిఆర్ శిక్షణ కార్యక్రమం అత్యవసర సమయంలో కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్  అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హెల్త్ సెంటర్లో సెయింట్ లూక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విజయ లూక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, జెడిఎస్ హాస్పిటల్తో సంయుక్తంగా నిర్వహించిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ ఒక ప్రాణాన్ని రక్షించే సాధనంగా సిపిఆర్ నిలుస్తుందని చెప్పారు.  ప్రతి విద్యార్థి ఇటువంటి అంశాలలో  తగిన తర్ఫీదు అవగాహన పొందాలని సూచించారు. తద్వారా తమ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులను వారి ప్రాణాలను రక్షించడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో యువత సిపిఆర్ చేసే విధానాన్ని నేర్చుకోవడం, స్వయంగా చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను రక్షించే  అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వర్సటీలో పెద్దెత్తున విద్యార్థులకు సిపిఆర్ పై శిక్షణ అందిస్తున్నామన్నారు. దీనిలో కొందరిని మాస్...

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది కప్ పోస్ట‌ర్ ఆవిష్క‌రణ

చిత్రం
 ఏయూ శ‌తాబ్ధి క్రీడాసంబ‌రాల‌కు శ్రీ‌కారం - 24న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది కప్ ప్రారంభోత్సవ వేడుక ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి క్రీడా సంబ‌రాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా విశ్వ‌విద్యాల‌యం క్రీడా విభాగం ఆధ్వ‌ర్యంలో యువ‌త‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, వారిలోని క్రీడా ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించే వేదిక‌ను సిద్దం చేసింది. విశ్వ‌విద్యాల‌య చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా ఒక నూత‌న క్రీడా సంబ‌రానికి ఏయూ సిద్ద‌మైంది.  ఈ నెల 24వ తేదీ మ‌ద్యాహ్నం 2 గంట‌ల‌కు ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం వేదిక‌గా ఆంధ్ర‌విశ్వ‌విద్యాలయ శ‌తాబ్ధి క్రికెట్ టోర్న‌మెంట్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను ఏయూ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. యువ‌త క్రీడా స్ఫూర్తిని చాటుతూ పోటీల‌లో భాగ‌స్వాములు కావాల‌ని కోరారు.  క్రికెట్ టోర్న‌మెంట్ ఆరంభం నుంచి యువ‌త‌లో ధీటైన పోటీని, ప్ర‌తిభ‌ను ప్ర‌త‌ర్శించే వేదిక‌గా నిలుస్తోంది. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మ‌రిత ఉత్కంఠ‌ను, క్రీడాకారుల్లో ఆస‌క్తిని పెంచుతూ నిర్వ‌...