లమ్మత ఆశిష్ కుమార్ న్యాయ‌శాస్త్రంలో డాక్ట‌రేట్

 లమ్మత ఆశిష్ కుమార్ న్యాయ‌శాస్త్రంలో డాక్ట‌రేట్

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, అక్టోబ‌ర్ 30:

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం న్యాయ క‌ళాశాల ప‌రిశోధ‌క విద్యార్థి ల‌మ్మ‌త ఆశిష్ కుమార్ కు డాక్ట‌రేట్ ల‌భించింది. న్యాయ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  "కన్వర్జింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్: ఎ గ్లోబల్ పెర్స్పెక్టివ్ ఆన్ యాజమాన్య మరియు లయబిలిటీ కాన్‌డ్రమ్" అనే అంశంపై జ‌రిపిన‌ పరిశోధనను డాక్ట‌రేట్ ల‌భించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో ఆశిష్ కుమార్‌కు ఉత్తర్వులు అంద‌జేసి అభినందించారు.

కృత్రిమ మేధ ఉప‌యోగించిన త‌యారు చేసిన‌, అభివృద్ధిచేసిన స‌మాచారం, జ్ఞానానికి సంబంధించిన హ‌క్కుల‌ను ఎవ‌రికి ఇవ్వాలి అనే అంశంపై అధ్య‌య‌నం చేశారు. వివిధ దేశాల‌లో దీనికి సంబంధించి చ‌ట్టాలు, వాటి ప‌నితీరు, ప‌రిధిని త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా అధ్య‌య‌నం చేశారు.

ఆయన పరిశోధన కృత్రిమ మేధస్సు మరియు మేధో సంపత్తి హక్కుల మధ్య అభివృద్ధి చెందుతున్న ఇంటర్‌ఫేస్‌ను విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది, ప్రపంచ న్యాయ శాస్త్రం, శాసన మరియు విధాన దృక్పథాలపై దృష్టి పెడుతుంది. ఈ అధ్యయనం AI-ఉత్పత్తి చేసిన పనుల చుట్టూ ఉన్న యాజమాన్యం మరియు బాధ్యత సమస్యలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న