ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది కప్ పోస్టర్ ఆవిష్కరణ
ఏయూ శతాబ్ధి క్రీడాసంబరాలకు శ్రీకారం
- 24న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది కప్ ప్రారంభోత్సవ వేడుక
ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి క్రీడా సంబరాలకు శ్రీకారం చుడుతున్నారు. శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా విశ్వవిద్యాలయం క్రీడా విభాగం ఆధ్వర్యంలో యువతను భాగస్వాములను చేస్తూ, వారిలోని క్రీడా ప్రతిభను ప్రోత్సహించే వేదికను సిద్దం చేసింది. విశ్వవిద్యాలయ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఒక నూతన క్రీడా సంబరానికి ఏయూ సిద్దమైంది. ఈ నెల 24వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం వేదికగా ఆంధ్రవిశ్వవిద్యాలయ శతాబ్ధి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఏయూ వైస్ చాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. యువత క్రీడా స్ఫూర్తిని చాటుతూ పోటీలలో భాగస్వాములు కావాలని కోరారు. క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం నుంచి యువతలో ధీటైన పోటీని, ప్రతిభను ప్రతర్శించే వేదికగా నిలుస్తోంది. ప్రారంభోత్సవ కార్యక్రమం మరిత ఉత్కంఠను, క్రీడాకారుల్లో ఆసక్తిని పెంచుతూ నిర్వహిస్తున్నారు.
అనంతరం క్రీడా టోర్నమెంట్ వివరాలను క్రీడా విభాగం సంచాలకులు ఆచార్య ఎన్.విజయ్ మోహన్ తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన క్రీడా జట్ల నుంచి ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ లక్కీ డిప్ ద్వారా రెండు జట్లను ఎంపిక చేస్తారు. ఎంపికైన ఈ రెండు అదృష్ట జట్లు ఒక సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడతాయి. సూపర్ ఓవర్‌లో గెలిచిన జట్టుకు కప్ తోపాటు రూ. 50,000/- నగదు బహుమతిగా, రన్నర్‌గా నిలచిన జట్టుకు రూ. 30,000/- నగదు బహుమతిగా అందజేయస్తారు. ప్రారంభోత్సవ కప్‌లో పాల్గొనే అన్ని జట్లు తమ పూర్తి స్క్వాడ్‌తో, యూనిఫారంలో హాజరు కానున్నారు. ఈ క్రీడా పోటీలలో 72 టీంట నుంచి దాదాపు 1300 మంది క్రీడా కారులు టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారన్నారు.
టోర్నమెంట్ వివరాలు....
ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రికెట్ టోర్నమెంట్ (శతాబ్ది కప్) ఈ నెల 28 నుంచి నిర్ణయించిన తేదీలలో జరుగుతాయి. ఈ క్రీడా పోటీలలో పాల్గొనే వారందరికీ పతకాలు, సర్టిఫికేట్లు అందిస్తారు.
భారీ నగదు బహుమతులు (Cash Awards): విశ్వవిద్యాలయ చరిత్రలో గతంలో లేని విధంగా ఈక్రీడా పోలీలలో విజేతలకు భారీ నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. టోర్నమెంట్ విజేతగా నిలచిన జట్టుకు రూ. 1,00,000/-, రన్నర్‌గా నిలచిన జట్టుకు రూ. 50,000/- నగదు పురస్కారం అందిస్తున్నారు. వీటితో పాటు సెమీ-ఫైనల్స్‌లో ఓడిన జట్లు ఒక్కొక్కరికి రూ. 30,000/-, క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లు ఒక్కొక్కరికి రూ. 20,000/-, ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లు ఒక్కొక్కరికి రూ. 10,000/- అందిస్తారు. వివిధ దశల్లో ప్రతిభ కనబరచిన ప్రతీ జట్టును ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. టీంకి అందించే నగదు పురస్కారాలతో పాటు క్రీడా కారుల ప్రతిభను గుర్తించి వ్యక్తిగత అవార్డులు ప్రధానం చేస్తున్నారు.
మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలచిన క్రీడాకారుడిని రూ. 10,000/-, ఉత్తమ బ్యాట్స్‌మెన్ గా నిలచిన క్రీడాకారుడికి రూ. 5,000/-, ఉత్తమ బౌలర్ గా నిలచిన క్రీడాకారుడికి రూ. 5,000/-, ఫెయిర్ ప్లే అవార్డు గా రూ. 5,000/- అందిస్తున్నారు. వీటితో పాటు టోర్నమెంట్‌లో పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడికి శతాబ్ధి లోగో, ఏయూ లోగోలతో కూడిన ప్రత్యేక మెడల్, సర్టఫికేట్‌లను అందిస్తారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, క్రీడా విభాగం సంచాలకులు ఆచార్య ఎన్.విజయ్ మోహన్, విభాగాధిపతి ఆచార్య ఏ.పల్లవి, డీన్‌లు ఆచార్య డి.లలిత భాస్కరి, ఆచార్య టి.షారోన్ రాజు, ఆచార్య జర్ర అప్పారావు, ఆచార్య సి.హెచ్ ఆశా ఇమ్మానియల్ రాజు, ఆచార్య ఎన్.ఎం యుగంధర్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి