టేకి జయ రక్షితకు సివిల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్

 

టేకి జయ రక్షితకు సివిల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్

ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థిని టేకి జయ రక్షితకు డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు ఎస్. ఆదిశేషు పర్యవేక్షణలో "ఎం25 మరియు ఎం35 గ్రేడ్లకు అరటి తంతువు బలపరచబడిన కాంక్రీటుపై సమగ్ర విశ్లేషణ" అనే అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఏ.యు ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ డాక్టరేట్ ఉత్తర్వులను రక్షిత అందుకున్నారు. ఈ పరిశోధనలో పునరుత్పత్తి సాధ్యమైన పర్యావరణహిత పదార్ధమైన అరటి తంతువును వినియోగిస్తూ, M25 మరియు M35 గ్రేడ్ల కాంక్రీటులో దాని బలము, మన్నిక, పనితీరు తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. ఈ పరిశోదన పర్యావరణ అనుకూల నిర్మాణ విదానాలకు ప్రోత్సాహకంగా నిలిచే అవకాశముంది.

ఈ సందర్భంగా విద్యార్థిని టేకి జయ రక్షిత స్పందిస్తూ ఈ పరిశోదన విజయవంతంగా పూర్తవడంలో నన్ను నిస్వార్ధంగా ఆదరించిన నా తల్లిదండ్రులకు, అన్ని వేళలా అర్ధం చేసుకొని సహకరించిన నా సోదరుడు మరియు సోదరికి, ప్రయోగశాలలో ఎప్పుడూ సహాయంగా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్లకు, మరియు నాకు తోడుగా నిలిచిన మిత్రులకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విజయం వారందరికీ అంకితం," అని అన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ పరిశోధనను పర్యావరణ హిత నిర్మాణ రంగానికి ఒక విలువైన ముందడుగుగా నిలుస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న