సిపిఆర్ చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు

 సిపిఆర్ చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు  
 ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సిపిఆర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రవిశ్వవిద్యాలయం, అక్టోబర్ 15 :

అత్యవసర సమయంలో కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె.అపరంజి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సిపిఆర్ చేసే విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. జాతీయ సేవా పథకం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో  ఆమె మాట్లాడుతూ యువత సిపిఆర్ విధానంపై అవగాహన పొందాలని తద్వారా వారు ఆపత్కాలంలో మరొకరిని రక్షించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం చొరవ తీసుకొని ప్రతి కళాశాల నుంచి విద్యార్థులకు  ఈ అంశంలో శిక్షణ అందించే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అమలు చేయడం పట్ల అభినందనలు తెలిపారు అనంతరం విద్యార్థులతో కలిసి సిపిఆర్ చేసి ఆపద్కాలంలో వ్యక్తుల ప్రాణాలు కాపాడుతాం అని ప్రతిజ్ఞ చేయించారు. 

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ ఒక ప్రాణాన్ని రక్షించే సాధనంగా సిపిఆర్ నిలుస్తుందని చెప్పారు. ప్రతి విద్యార్థి ఇటువంటి అంశాలలో  తగిన తర్ఫీదు అవగాహన పొందాలని సూచించారు. తద్వారా తమ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులను వారి ప్రాణాలను రక్షించడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో యువత సిపిఆర్ చేసే విధానాన్ని నేర్చుకోవడం, స్వయంగా చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను రక్షించే  అవకాశం ఏర్పడుతుందని అన్నారు. అదేవిధంగా కేజీహెచ్ లో ఏయూ విద్యార్థులకు ఉపయుక్తంగా ఒక ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.  

విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్  ఆచార్య ఎస్. హరినాథ్ మాట్లాడుతూ సిపిఆర్ వారోత్సవాలలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్నారు.  ఏయూ క్యాంపస్ లోని ఎనిమిది కళాశాల నుంచి విద్యార్థులను ఈ శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు శిక్షణ అందించి తద్వారా వారు మరింత మందికి దీనిని చేరువ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. గుండు పోటు వచ్చిన సందర్భంలో, ప్రమాదాలు సంభవించి అత్యవసర సమయాలలో సిపిఆర్ చేయడం ఎంతో అవసరమని దీని ప్రాధాన్యత తెలుసుకొని యువత శిక్షణ పొందాలని సూచించారు. సిపిఆర్ వారోత్సవాలలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్నారు.

 కార్యక్రమంలోఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.నరసింహారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నవీన్, ఆచార్య రాజేంద్రప్రసాద్, ఆచార్య రాఘవరావు, ఆచార్య మేరీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్యులు సిపిఆర్ విధానం పై విద్యార్థులకు శిక్షణ అందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న