జేడీ వార్షిక డిజైన్ అవార్డ్స్–2026 ప్రధానం
జేడీ వార్షిక డిజైన్ అవార్డ్స్–2026 ప్రధానం -ఆకట్టుకున్న విద్యార్థుల సృజనాత్మకత విశాఖపట్నం: సృజనాత్మక విద్యకు, డిజైన్ రంగంలో ప్రతిభావంతులైన యువతను తీర్చిదిద్దడంలో విశిష్ట సేవలందిస్తున్న జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, విశాఖపట్నం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ (ADA)–2026 కార్యక్రమం నోవాటెల్ హోటల్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. “వసుధైవ కుటుంబకం – ప్రపంచమంతా ఒకే కుటుంబం” అనే ప్రధాన అంశంతో జరిగింది. భారతీయ సంస్కృతిలోని ఈ మహోన్నత భావాన్ని ప్రతిబింబించేలా విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలు, వినూత్న రూపకల్పనలు, సామాజిక బాధ్యత, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలు ఈ ప్రదర్శనలో ప్రతిఫలించింది. నగరానికి చెందిన రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వాహకులు దాడి రవికుమార్ ఈ కార్యక్రమానికి సమన్వయం చేస్తూ విజయవంతంగా నిర్వహించారు. జేడీ ఇన్‌స్టిట్యూట్ విశాఖపట్నం కేంద్రం గత 13 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ, ప్రాక్టికల్ లెర్నింగ్, అంతర్జాతీయ ప్రమాణాల బోధన అందిస్తూ అనేక మంది యువతకు విజయవంతమైన కెరీర్‌న...