జేడీ వార్షిక డిజైన్ అవార్డ్స్–2026 ప్ర‌ధానం

 జేడీ వార్షిక డిజైన్ అవార్డ్స్–2026 ప్ర‌ధానం
-ఆక‌ట్టుకున్న విద్యార్థుల సృజ‌నాత్మ‌క‌త‌


విశాఖపట్నం:

సృజనాత్మక విద్యకు, డిజైన్ రంగంలో ప్రతిభావంతులైన యువతను తీర్చిదిద్దడంలో విశిష్ట సేవలందిస్తున్న జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, విశాఖపట్నం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ (ADA)–2026 కార్యక్రమం నోవాటెల్ హోట‌ల్‌లో అత్యంత వైభవంగా నిర్వ‌హించారు. “వసుధైవ కుటుంబకం – ప్రపంచమంతా ఒకే కుటుంబం” అనే ప్రధాన అంశంతో  జ‌రిగింది. భారతీయ సంస్కృతిలోని ఈ మహోన్నత భావాన్ని ప్రతిబింబించేలా విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలు, వినూత్న రూపకల్పనలు, సామాజిక బాధ్యత, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలు ఈ ప్రదర్శనలో ప్రతిఫలించింది. న‌గ‌రానికి చెందిన రేస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్వాహ‌కులు దాడి ర‌వికుమార్ ఈ కార్య‌క్ర‌మానికి స‌మ‌న్వ‌యం చేస్తూ విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు.


జేడీ ఇన్‌స్టిట్యూట్ విశాఖపట్నం కేంద్రం గత 13 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ, ప్రాక్టికల్ లెర్నింగ్, అంతర్జాతీయ ప్రమాణాల బోధన అందిస్తూ అనేక మంది యువతకు విజయవంతమైన కెరీర్‌ను అందించింది. ప్రతి సంవత్సరం నిర్వహించే జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా నిల‌చింది. ఈ కార్యక్రమంలో ఎనిమిది విభిన్న థీమ్‌లతో రూపొందించిన డిజైన్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు నెలల తరబడి చేసిన పరిశోధన, సృజనాత్మకత, నైపుణ్యం, కృషికి ఈ వేదిక నిదర్శనంగా నిలచింది.



ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన తో కార్య‌క్ర‌మం ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథుల ప్రసంగాలు, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, విశిష్ట అతిథుల సన్మానం, అవార్డు ప్రదానోత్సవం, ప్రత్యేక ర్యాంప్ షోలు ప్రధాన ఆకర్షణలుగా నిల‌చాయి. ఈ సందర్భంగా జేడీ ఇన్‌స్టిట్యూట్ విశాఖపట్నం సెంటర్ డైరెక్టర్లు శ్రీ కట్టమూరి ప్రదీప్ మరియు శ్రీమతి కట్టమూరి దివ్య మాట్లాడుతూ… “జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ అనేది కేవలం ఒక ఫ్యాషన్ షో మాత్రమే కాద‌ని, విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కృషి, ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వేదికగా నిలుస్తుంద‌న్నారు. విశాఖపట్నంలో 13 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా, ‘వసుధైవ కుటుంబకం’ అనే అంశంతో సమాజానికి సానుకూల సందేశాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామ‌న్నారు.



జేడీ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ శ్రీ రూపల్ దలాల్, డైరెక్టర్ శ్రీ హర్ష్ దలాల్ నాయకత్వంలో సంస్థ దేశవ్యాప్తంగా డిజైన్ విద్యలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పుతూ, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను కల్పిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, మీడియా ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

టేకి జయ రక్షితకు సివిల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

సిపిఆర్ చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు