‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా డా. ఎం. సృజన దేవి
‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా డా.ఎం.సృజన దేవి
విశాఖపట్నం, డిసెంబర్ 21, 2025:
ఫరెవర్ స్టార్ ఇండియా – మిస్ యూనివర్స్ ఇండియా 2025 గ్రాండ్ ఫినాలే విజేతగా నగరానికి చెందిన డాక్టర్ సృజన దేవి ఎంపికయ్యారు. ఇటీవల జైపూర్‌లోని Z స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించిన తుది పోటీలలో డాక్టర్ సృజన ఆల్‌రౌండ్ ప్రతిభతో విజేతగా నిలచారు.దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది పోటీదారుల నుంచి, 100 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. పలు దశల పోటీల అనంతరం ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, మేధస్సు, సామాజిక అవగాహనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన డా. ఎం. సృజన దేవి (ఎం.డి – అనస్థీషియా) ‘ఫారెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా విజేతగా నిలిచారు. ఈ జాతీయ స్థాయి పోటీలను సీఈఓ రాజేష్ అగర్వాల్ మరియు డైరెక్టర్ జయ చౌహాన్ సమర్థ నాయకత్వంలో నిర్వహించారు.
వైద్య వృత్తిలో కొనసాగుతున్న డా. సృజన దేవి నేడు సాధించిన విజయం, యువతకు, మహిళలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. గ్రాండ్ ఫినాలేలో డా. ఎం. సృజన దేవి కి ప్రత్యేకంగా అశ్వత్థ మేకోవర్ సంస్థ, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ - మేకప్ ఆర్టిస్ట్ మిస్ రాజి పర్యవేక్షణలో స్టైలింగ్ చేసింది. ఈ కార్యక్రమం ఆధునిక భారతీయ మహిళా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా విశాఖలో డాక్టర్ సృజన దేవిని పలువురు వైద్యులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అభినందించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి