గూగుల్ విశాఖకు రావడం అభివృద్దికి ఉపయుక్తం
విశాఖ నగరం ఐటి రాజధానిగా అవతరిస్తుంది
భవిష్యత్తులో విశాఖ నగరం ఐటి, ఏఐ రాజధానిగా అవతరిస్తుందని విశాఖ జిల్లా బి.సి వెల్ఫేర్ ఫెడరేషన్ అద్యక్షుడు మండెం సుభాష్ చంద్రబోస్ అన్నారు. విశాఖ నగరంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు స్వాగతిస్తున్నామన్నారు. ఇటువంటి సంస్థలు విశాఖకు రావడం వలన అనుబంధంగా అనేక సంస్థలు విశాఖకు వస్తాయన్నాతరు. తద్వారా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. శనివారం ఏయూలోని మహత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపే దిశగా, కూటమి ప్రభుత్వం విశాఖ నగరంలో గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలను తేవడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడుకి, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య విలువలు, పరిపాలన సామర్థ్యం, అనుభవం కలిగిన నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో పయనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ యాదవ సంఘం ఉపాధ్యక్షులు పల్లా రమేష్ యాదవ్, మత్స్యకార సంఘం నాయకుడు పొట్టి పోలిరాజు, అరిసిల్లి అమ్మోరు, ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయిస్ నాయకుడు కోన పోలా రావు, నగరాలు కుల సంఘ నాయకుడు బంగారి ఎస్ రవి, నాగవంశం కుల సంఘ నాయకుడు మద్దుగారి ప్రసాద్, తూర్పు కాపు నాయకుడు కోలా కార్తీక్ నాయుడు, కొప్పుల వెలమ నాయకుడు గుడివాడ జనార్దన్ రావు, గవర సంఘం నాయకుడు వేగి జగ దీశ్వరరావు, దళిత సంఘ నాయకులు నీలాపు వెంకట్రావు, ధర్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి