మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్టరేట్
మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్టరేట్
ఆంధ్రవిశ్వవిద్యాలయం మెరైన్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థి మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు వి.వి.ఎస్. ప్రసాద్ మార్గదర్శకత్వంలో "కంప్యూటేషనల్ అండ్ ఎక్సపెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎన్ యానులర్ కుకింగ్ బౌల్ ఫర్ నాన్-సెంట్రిఫ్యూగల్ కేన్ షుగర్ యూనిట్ యూజింగ్ ఫుడ్-గ్రేడ్ ఆయిల్ అండ్ గ్రాఫిన్ నానోప్లేట్ లెట్ డిస్ఫర్షన్స్" అంశంపై చేసిన పరిశోదన కు డాక్టరేట్ లభించింది. సాంప్రదాయ విధానంలో చెరుకు పిప్పిని మండించి బెల్లం తయారీ జరుపుతుంటారు. దీనికి ప్రత్యామ్నాయ విధానాన్ని పర్యవారణహిత సాంకేతికతలను అభివృద్ధి చేసారు. మొహమ్మద్ అబ్దుల్ రజాక్ తన పరిశోధన ఫలితాలను నాలుగు ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు.
ఏయూ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను ఆయన స్వీకరించారు. మెరైన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు, కుటుంబ సభ్యలు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అబ్దుల్ రజాక్ గీతం విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి