పోస్ట్‌లు

శతాబ్ది ఉత్సవ సమారంభం

చిత్రం
 శతాబ్ది ఉత్సవ సమారంభం  ఘనంగా ఏయు శతాబ్ది సంవత్సర వేడుకలు ప్రారంభం  జయహో ... ఏయు నినాదాలతో హోరెత్తిన సాగరతీరం   విశ్వానికే మణిహారం... ఆంధ్ర విశ్వవిద్యాలయం  ... విశాఖపట్నం ఏప్రిల్ 26:  ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం సాగర తీరంలో కాళీమాత ఆలయం వద్ద నుంచి ఏయు కన్వెన్షన్ సెంటర్ వరకు వాకతాన్ కార్యక్రమం నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ ఏయూ అధికారులు, పూర్వ ఉపకులపతులతో కలసి ప్రారంభించారు. విద్యార్థుల జయ జయ ద్వానాలతో.... జయహో ఏయు నినాదాలతో... సాగర తీరం హోరెత్తింది. వందలాది మంది విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది తరలిరాగా ఏయు కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీ కన్నుల పండుగగా సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ విశిష్టతను చాటే విధంగా విద్యార్థులు నినాదాలు ఇస్తూ, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. అనంతరం ఏయు కన్వెన్షన్ సెంటర్ వద్ద విద్యార్థులను ఉద్దేశించి ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా విశ్వ కళామతల్లి ఆవిర్భవించిందని చెప్పారు. విశ్...

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవ శోభ

చిత్రం
  ఆంధ్ర విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవ శోభ  — నేటి నుంచి శతాబ్ది సంవత్సరం ప్రారంభం  — ఏడాది పొడవునా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక  — 2026 ఏప్రిల్ 26న ఘనంగా శతాబ్ది  సంవత్సరం ముగింపు వేడుకలు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవ శోభను సంతరించుకుంది. శనివారం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఏడాది కాలం కొనసాగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లను చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం పాలకమండలి సమావేశం మందిరంలో కోర్ కమిటీ సభ్యులతో వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంవత్సరం  శనివారం ప్రారంభమై  ఏడాది కాలం పాటు ఈ ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరం పొడుగునా అకడమిక్, ఔట్రీచ్, మెగా  ఈవెంట్లు జరుగుతాయని తెలిపారు. అదే విధంగా 2026 ఏప్రిల్ 26న శతాబ్ది సంవత్సర ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే మెగా ఈవెంట్లను విభిన్న విభాగాలు సంయుక్తంగా, సమన్వయం...

ఉగ్రవాదంతో దేశ భద్రతకే ముప్పు

చిత్రం
  ఉగ్రవాదంతో దేశ భద్రతకే ముప్పు  -విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు   ఉగ్రవాదంతో దేశ భద్రతకు ముప్పు వస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు అన్నారు. కాశ్మీరులో ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి ఈరోజు విభాగంలో విద్యార్థులు కలిసి నివాళులు అర్పించారు. అమాయకులైన పర్యాటకులపై ముష్కర మూకలు విరుచుకుపడటం, ప్రాణాలను హరించడం శోచనీయమని అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలకు తగిన గుణపాఠం, సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటూ మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో విభాగ ఆచార్యులు డాక్టర్ ఆలీ, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ సాల్మన్, డాక్టర్ రాము విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థులే వర్సిటికి తరగని సంపద

చిత్రం
 ఆర్ట్స్ విద్యార్థులకు 100 శాతం ఉద్యోగాలు - ఏయు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహారావు ఆంధ్రా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల పరిధిలో పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక లు అమలు చేస్తున్నామని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ.నరసింహారావు పేర్కొన్నారు. సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం " కెరీర్ ప్లానింగ్ & ప్రొఫెషనల్ స్కిల్స్ ఫర్ సోషల్ వర్క్ స్టూడెంట్స్ " అంశం పై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ ఏ.నరసింహారావు పాల్గొని ప్రసంగించారు. వందేళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కళామతల్లి లక్షలాది మంది విద్యార్థులను జాతికి అంకితం చేసిందన్నారు. పూర్వ విద్యార్థులే వర్సిటికి తరగని సంపదగా పేర్కొన్నారు.  సోషల్ వర్క్ విభాగం అధిపతి ప్రొఫెసర్ S. హరనాధ్  మాట్లాడుతూ సోషల్ వర్క్ పూర్తి చేసిన విద్యార్థులకు అపారమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సామాజిక దృక్పధం విద్యార్థులకు ఎంతో ముఖ్యం అన్నారు.  పేదరికం ప్రగతికి అడ్డు కాదన్నారు.  రిసోర్స్ పర్సన్ డాక్టర్ జె.ప్రసాద్ మాట్లా...

Vankayala Sruthi Sarani Achieves 'A' Grade in Devotional Music by All India Radio

చిత్రం
  Carnatic Vocalist   Vankayala Sruthi Sarani  Achieves 'A' Grade in Devotional Music by All India Radio In a significant milestone for the Carnatic music community,  Vankayala Sruthi Sarani, a distinguished vocalist known for her soulful renditions of devotional compositions, has been awarded the coveted 'A' Grade status in Devotional Music Vocal by All India Radio.  This recognition underscores her exceptional talent and dedication to preserving and promoting the rich traditions of Carnatic music. Hailing from a lineage steeped in musical heritage,  Sruthi Sarani's early exposure to Carnatic music ignited her passion for the art form. Under the tutelage of esteemed gurus, Prof K. Saraswati Vidyardhi and Sri M.S.N.Murthy, she honed her skills in both vocal performance and composition, specializing in devotional pieces that resonate with listeners on a spiritual level. Achieving 'A' Grade status with AIR is a testament to Smt. Sruthi Sarani's proficien...

వంకాయల శృతి సారణి కి ఆలిండియా రేడియో సంగీతంలో 'ఎ' గ్రేడ్

చిత్రం
  ప్రఖ్యాత కర్ణాటక గాయని వంకాయల శృతి సారణి కి     ఆలిండియా రేడియో  సంగీతంలో 'ఎ' గ్రేడ్  ప్రముఖ కర్నాటక సంగీత గాయని వంకాయల శృతి సారణి ఆలిండియా రేడియో  భక్తి సంగీత గానంలో 'ఎ' గ్రేడ్ హోదా సాధించారు. కర్ణాటక సంగీతం యొక్క గొప్ప సంప్రదాయాలను సంరక్షించడం మరియు ప్రోత్సహించడం పట్ల ఆమె అసాధారణ ప్రతిభ మరియు అంకితభావానికి  గుర్తింపుగా ఏ గ్రేడ్ లభించింది. సంగీత వారసత్వం నుండి వచ్చిన వంకాయల శృతి కర్ణాటక సంగీతాన్ని  ప్రొఫెసర్ కె. సరస్వతి విద్యార్థి మరియు శ్రీ ఎం.ఎస్.ఎన్.మూర్తిల పర్యవేక్షణలో శిక్షణ పొందారు

పుస్తకాల స్థానంలో ఇ–రిసోర్సెస్స్‌ చేరిపోయాయి

చిత్రం
  చరిత్రకు వారధి .... జ్ఞానానికి సారధి ....   తల్లి జన్మనిస్తుంది . తండ్రి భరోసా ఇస్తారు . ఉపాధ్యాయుడు అక్షరాన్ని ఆస్తిగా ఇస్తాడు . పుస్తకం అపార జ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేస్తుంది . వ్యక్తిగా భూమిపైకి వచ్చిన మనల్ని మహోన్నత శక్తిగా తీర్చిదిద్దే ఆయుధం పుస్తకం . అక్షరజ్ఞానం కలిగిన ప్రతీ వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దే అంశాలలో పుస్తకం ఒకటి . విభిన్న సంసృతుల మధ్య , గతానికి , వస్తమానానికి మధ్య , విభిన్న తరాల మధ్య వారధిగా పుస్తకం నిలుస్తుంది . నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం , ప్రపంచ కాపీరైట్ ‌ డేలను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు . పుస్తక ప్రాముఖ్యతను ప్రజలకు వివరించే ఉద్దేశంతో యునెస్కో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం   ఏప్రియల్ ‌ 23 న నిర్వహిస్తున్నారు .. దశాబ్ధాల కాలం నుంచి పుస్తకాన్నికి ఉన్న ప్రాముఖ్యత అపారం . బాల్యంలో బలపం పట్టుకున్న చేతులు తరువాతి కాలంలో పుస్తకాలను పట్టుకుని తన భవిష్యత్తును లిఖించుకుంటాయి . మేధస్సు పొందడానికి కులమతాలు , ఆర్ధిక అసమానతలు అవాంతరాలు కావు . జ్ఞానాని...