పుస్తకాల స్థానంలో ఇ–రిసోర్సెస్స్‌ చేరిపోయాయి

 

చరిత్రకు వారధి....జ్ఞానానికి సారధి....

 


తల్లి జన్మనిస్తుంది. తండ్రి భరోసా ఇస్తారు. ఉపాధ్యాయుడు అక్షరాన్ని ఆస్తిగా ఇస్తాడు. పుస్తకం అపార జ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేస్తుంది. వ్యక్తిగా భూమిపైకి వచ్చిన మనల్ని మహోన్నత శక్తిగా తీర్చిదిద్దే ఆయుధం పుస్తకం. అక్షరజ్ఞానం కలిగిన ప్రతీ వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దే అంశాలలో పుస్తకం ఒకటి. విభిన్న సంసృతుల మధ్య, గతానికి, వస్తమానానికి మధ్య, విభిన్న తరాల మధ్య వారధిగా పుస్తకం నిలుస్తుంది. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం, ప్రపంచ కాపీరైట్డేలను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పుస్తక ప్రాముఖ్యతను ప్రజలకు వివరించే ఉద్దేశంతో యునెస్కో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం  ఏప్రియల్‌ 23 నిర్వహిస్తున్నారు..

దశాబ్ధాల కాలం నుంచి పుస్తకాన్నికి ఉన్న ప్రాముఖ్యత అపారం. బాల్యంలో బలపం పట్టుకున్న చేతులు తరువాతి కాలంలో పుస్తకాలను పట్టుకుని తన భవిష్యత్తును లిఖించుకుంటాయి. మేధస్సు పొందడానికి కులమతాలు, ఆర్ధిక అసమానతలు అవాంతరాలు కావు. జ్ఞానానికి అందరూ సమానమే. మనకు అవసరమైనది మనం పొందడం, మన వ్యక్తిగత ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. మనస్సు స్థిరత్వం లేనప్పుడు, అధైర్యం ఆవహించినపుడు అసాధారణ వ్యక్తిత్వంతో ఉన్నతంగా ఎదిగిన వ్యక్తుల జీవిత చరిత్రను చదివితే నూతన శక్తి వస్తుంది. మనోధైర్యాన్ని నింపే ప్రభావవంతమైన సూక్తులు, ప్రసంగాలు పుస్తకాలలో లభిస్తాయి.

పాఠశాలలో నిర్ధిష్టమైన శాస్త్ర సంబంధమైన పుస్తకాలను చదవడం జరుగుతుంది. కళాశాల స్థాయికి వెళ్లిన తరువాత శాస్త్ర సంబంధ పుస్తకాలతో పాటు అనుబంధ గ్రంధాలను అధ్యయనం చేయడం, వాటి నుంచి సైతం మరింత లోతైన అవగాహన పొందడం జరుగుతుంది. పీజీ, పిహెచ్డి స్థాయిలో ఒకే అంశంపై విభిన్న దేశాలల్లో రచయితలు రచించిన పుస్తకాలను, అంశాలను అధ్యయనం చేయడం, వాటిని బేరీజు వేసుకుంటూ నూతన సిద్ధాంతాలను ఆవిష్కరించడం, ప్రతిపాదించడం జరుగుతుంది.

పుస్తకాలు కేవలం శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా కళలు, సాహిత్యం, చరిత్ర వంటి వైవిధ్యమైన అంశాలను మనకు పరిచయం చేస్తాయి. శతాబ్ధాలుగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను కళ్లకు కట్టినట్లు వివరించినవి నాటి పుస్తకాలే. తరువాతి కాలంలో డాక్యుమెంటరీలు, సినిమాలు వంటివి కొంత లోతైన విశ్లేషణలు, అవగాహన కల్పించిన పుస్తకం అందించిన ప్రేరణ, వివరణలు మరేవీ ఇవ్వలేదు. 

గతంలో ప్రతీ కళాశాలలో ప్రత్యేకంగా గ్రంధాలయం, గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రత్యేకంగా గ్రంధాలయాలు ఉండేవి. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే యువత నుంచి వృద్దుల వరకు అందరూ ఇక్కడ నిత్యం రెండుమూడు గంటలు గడిపేవారు. తమకు అవసరమైన పుస్తకాలను చదువుకుంటూ, కావాల్సిన జ్ఞానాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసేవారు.

కాలంతో పాటు ప్రజల అభిరుచులు, ఆలోచనల్లో ఎంతో మార్పు వస్తోంది. సాంకేతికత విస్తృతి నేపధ్యంలో కొంత వరకు పుస్తకానికి ప్రాధాన్యత తగ్గిపోతోంది. గతంలో ఉన్న తరహాలో పుస్తక ముద్రణలు జరగడం లేదు. గతంలో మాదిరిగా కధలు, కధానికలు, కవితలు ముద్రణ తగ్గిపోయింది. నేడు పుస్తకాన్ని ముద్రించినా చదవేవారు ఎంత మంది ఉన్నారు అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.

యువత సైతం కేవలం తమ పాఠ్య సంబంధ పుస్తకాలు చదవడానికే ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. విరామం కోసం, జ్ఞానం, భాష వికాసానికి దోహదపడే పుస్తకాలను, ప్రపంచాన్ని పరిచయం చేసే వ్యాసాలను, వివిష్ట గ్రంధాలను చదవాలనే ఆసక్తిని ఎంతమాత్రం చూపడం లేదు. ఉన్న సమయాన్ని సామాజిక మాధ్యమాలలో గడపడానికి వెచ్చిస్తున్న యువత తమ ప్రగతికి ఉపయుక్తంగా నిలచే సామాజిక జ్ఞానాన్ని అందించే పుస్తక పఠనానికి ఆసక్తి చూపకపోవడం శోచనీయం.

పుస్తకాల స్థానంలో రిసోర్సెస్స్చేరిపోయాయి. గ్రంధాలయాలలో సైతం బుక్స్, జర్నల్స్వంటివి వచ్చి చేరిపోతున్నాయి. విద్యార్థులు సైతం బుక్స్డి డౌన్లోడ్చేసుకుని మెబైల్ఫోన్లో, ల్యాప్టాప్లో చదివడానికే ఆసక్తి చూపుతున్నారు. కొత్త పుస్తకాన్ని కొనుగోలు చేసి దాని నుంచి అక్షర పరిమళాన్ని ఆస్వాదిస్తూ మదిలో నింపుకునే సందర్భానికి ఆస్వాదించాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయం లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

పుస్తకాలను చదవడం వలన పద సంపద పెరుగుతుంది. అదే సమయంలో నూతన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. రచనలు చేయడం, స్వీయ అనుభవాలను, అనుభూతులకు అక్షర రూపం కల్పించాలనే ఆకాంక్ష ఏర్పడుతుంది. తద్వారా మనలో ఒక రచయితని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గతంలో దైనందిని(డైరీ) రాసే అలవాటు చాలా మందికి ఉండేది. కాల గమనంలో ఇది పూర్తిగా మారిపోయింది. నిత్యం తమ దినచర్య, చేసిన పనులు, తమ అనుభవాలను దీనిలో నిక్షిప్తం చేసుకునే వారు. ఖాళీ సమయంలో ఒక సారి డైరీని తీసి చదివితే మనసుకు స్వాంతన చేసే అనేక సంఘటనలు కళ్లముందు కదలాడేవి. అటువంటి ఎన్నో అపురూప సందర్భాలను కలిగిన పుస్తకం నేడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. వీధిలో కనిపించే గ్రంధాలయాలు కనుమరుగవున్నాయి. ఇంటి అల్మారాలో పుస్తకాలే కనిపించడం లేదు.

ప్రధాన పట్టణాలలో కొన్ని ప్రైవేటు లైబ్రరీలు మాత్రం నడుస్తున్నాయి. వీటిలో ఏడాదికి మూడు నుంచి ఆరు వేల రూపాయలకు వరకు ప్రవేశ రుసుము చెల్లించి తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకువెళ్లి చదువుకునే అవకాశం ఉంది. ఇవి కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనితో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే పుస్తకాలను చదువుకునే అవకాశం కలుగుతోంది. వీటిలో ఆంగ్ల భాష పుస్తకాలు, ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రచనలు మాత్రమే లభిస్తున్నారు. చరిత్ర పునరావృతం అవుతున్ని అన్న చందంగా పుస్తక పఠనాసక్తిని పెంచే కార్యక్రమాలు పాఠశాల స్థాయి నుంచి ప్రారంభం కావాలి. తద్వారా చిన్నవయస్సు నుంచి వివిధ అంశాలతో కూడిన పుస్తకాలను చదవాలనే ఆసక్తిని చిన్నారుల్లో ప్రేరేపించాలి. తద్వారా పుస్తకాన్ని భవిష్యత్తరాలకు అందించే ప్రయత్నం చేయాలి.

 

డాక్టర్వేదుల నరసింహం
 
జర్నలిజం విభాగం
 
ఆంధ్రవిశ్వవిద్యాలయం
.

 

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న