శతాబ్ది ఉత్సవ సమారంభం
శతాబ్ది ఉత్సవ సమారంభం
ఘనంగా ఏయు శతాబ్ది సంవత్సర వేడుకలు ప్రారంభం
జయహో ... ఏయు నినాదాలతో హోరెత్తిన సాగరతీరం
విశ్వానికే మణిహారం... ఆంధ్ర విశ్వవిద్యాలయం ...
విశాఖపట్నం ఏప్రిల్ 26:
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం సాగర తీరంలో కాళీమాత ఆలయం వద్ద నుంచి ఏయు కన్వెన్షన్ సెంటర్ వరకు వాకతాన్ కార్యక్రమం నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ ఏయూ అధికారులు, పూర్వ ఉపకులపతులతో కలసి ప్రారంభించారు. విద్యార్థుల జయ జయ ద్వానాలతో.... జయహో ఏయు నినాదాలతో... సాగర తీరం హోరెత్తింది. వందలాది మంది విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది తరలిరాగా ఏయు కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీ కన్నుల పండుగగా సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ విశిష్టతను చాటే విధంగా విద్యార్థులు నినాదాలు ఇస్తూ, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. అనంతరం ఏయు కన్వెన్షన్ సెంటర్ వద్ద విద్యార్థులను ఉద్దేశించి ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా విశ్వ కళామతల్లి ఆవిర్భవించిందని చెప్పారు. విశ్వ కళామతల్లి ప్రాంగణంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మున్ముందుకు వెళ్లే విధంగా నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. దీనిని ప్రతిజ్ఞగా స్వీకరించి అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మరెంతో ప్రగతిని, అభ్యున్నతిని సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి, భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే దిశగా పనితీరు చూపుతూ, ప్రగతి సాధించాలని ఈ దిశగా సమిష్టిగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏడాది మొత్తం విభిన్న విద్య, సాంకేతిక, అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే సంవత్సరం ఇదే రోజున ఘనంగా శతాబ్ది ఉత్సవ వేడుకలను నిర్వహిస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయ రావు, పూర్వ ఉపకులపతులు ఆచార్య వి బాల మోహన్ దాస్, బీలా సత్యనారాయ,ణ జి.ఎస్.ఎన్ రాజు, వి.ఎస్.ఆర్.కే ప్రసాద్, ఆర్.సుదర్శన రావు, కె.రామకృష్ణారావు, ఏయూ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఏయు పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కె.వి.వి రావు, పెద్ద సంఖ్యలో ఆచార్యులు, పరిశోధకులు విద్యార్థులు ఉద్యోగులు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి