ఉగ్రవాదంతో దేశ భద్రతకే ముప్పు
ఉగ్రవాదంతో దేశ భద్రతకే ముప్పు
-విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు
ఉగ్రవాదంతో దేశ భద్రతకు ముప్పు వస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు అన్నారు. కాశ్మీరులో ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి ఈరోజు విభాగంలో విద్యార్థులు కలిసి నివాళులు అర్పించారు. అమాయకులైన పర్యాటకులపై ముష్కర మూకలు విరుచుకుపడటం, ప్రాణాలను హరించడం శోచనీయమని అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలకు తగిన గుణపాఠం, సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటూ మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో విభాగ ఆచార్యులు డాక్టర్ ఆలీ, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ సాల్మన్, డాక్టర్ రాము విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి