పూర్వ విద్యార్థులే వర్సిటికి తరగని సంపద
ఆర్ట్స్ విద్యార్థులకు 100 శాతం ఉద్యోగాలు
- ఏయు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహారావు
ఆంధ్రా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల పరిధిలో పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక లు అమలు చేస్తున్నామని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ.నరసింహారావు పేర్కొన్నారు. సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం " కెరీర్ ప్లానింగ్ & ప్రొఫెషనల్ స్కిల్స్ ఫర్ సోషల్ వర్క్ స్టూడెంట్స్ " అంశం పై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ ఏ.నరసింహారావు పాల్గొని ప్రసంగించారు. వందేళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కళామతల్లి లక్షలాది మంది విద్యార్థులను జాతికి అంకితం చేసిందన్నారు. పూర్వ విద్యార్థులే వర్సిటికి తరగని సంపదగా పేర్కొన్నారు.
సోషల్ వర్క్ విభాగం అధిపతి ప్రొఫెసర్ S. హరనాధ్ మాట్లాడుతూ సోషల్ వర్క్ పూర్తి చేసిన విద్యార్థులకు అపారమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సామాజిక దృక్పధం విద్యార్థులకు ఎంతో ముఖ్యం అన్నారు. పేదరికం ప్రగతికి అడ్డు కాదన్నారు. రిసోర్స్ పర్సన్ డాక్టర్ జె.ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కెరీర్ ను మలచుకునే విధానం ఎంతో ముఖ్యం అన్నారు. కమ్యూనికేషన్, అధ్యయనం, నిరంతర శ్రమ ఎంతో అవసరం అన్నారు.
పోర్టు ట్రస్ట్ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ Dr. అవతారం నాయుడు మాట్లాడుతూ తల్లి దండ్రుల కలలను విద్యార్థులు సాకారం చేయాలన్నారు. మెడ్ టెక్ జోన్ సైంటిస్ట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ సోషల్ వర్క్ పూర్తి చేసిన విద్యార్థులకు అనేక విభాగల్లో ఫెలో షిప్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. సుమారు పది రాష్ట్రాల్లో ముఖ్య మంత్రి ఫెలో షిప్ లు కూడా ఇస్తున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమం లో మహిళా,శిశు సంక్షేమ శాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ రాములు, అధ్యాపకులు డాక్టర్ కోమలి సలోమి, అబ్రహం,శ్యామ్ కుమార్,ఆశాకిరణ్, పుష్పలత, లక్ష్మణరావు, శిరీష, అమిత, సూరిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి