ఏయూ సిఈ పూర్వవిద్యార్థుల సమావేశం 7న
ఏయూ సిఈ పూర్వవిద్యార్థుల సమావేశం 7న - రూ 4.5 కోట్లతో హాస్టల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు ఆంధ్రవిశ్వవిద్యాలయం, డిసెంబర్ 5 : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని 7 వ తేదీన వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్యక్షులు ఐ.వి.ఎన్.ఎస్.కె విశ్వనాథ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సంఘం కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా పట్టభద్రులైన పూర్వ విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వవిద్యార్థులు తమ ప్రయాణాన్ని, ప్రగతిని, అనుభవాలను, అనుభూతులను ఈ సందస్భంగా పం...

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి