పోస్ట్‌లు

జూన్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అంగ రంగ వైభవంగా ఇస్కాన్ శ్రీ జగన్నాథ రథయాత్ర

చిత్రం
 అంగ రంగ వైభవంగా ఇస్కాన్ శ్రీ జగన్నాథ రథయాత్ర  ఇస్కాన్ విశాఖపట్నం శాఖ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభు ఆధ్వర్యంలో 18వ సారి శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. మంగళధ్వని, కోలాటం, భజనలు, సంకీర్తనలు, హరే కృష్ణ మహామంత్ర గోష్పద ధ్వనులతో రథయాత్ర ప్రారంభమైంది. సుభద్రా, బలరామ, శ్రీ జగన్నాథ స్వామివారు పుష్పాలతో అలంకరించబడిన రథంపై భక్తుల కోలాహల మధ్య విహరించారు. ఈ కార్యక్రమానికి సాంబాదాస్ మాతాజీ నితాయ్ సేవిని గారు రథం ముందు కొబ్బరికాయ కొట్టి, సేవాభావంతో ఊడ్చి రథయాత్రను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం ఎమ్మెల్యే గణబాబు గారు హాజరయ్యారు.  జీవీఎంసీ సెంట్రల్ పార్క్ నుండి ప్రారంభమైన యాత్ర, డాబాగార్డెన్స్, జగదాంబ సెంటర్, రామనగర్ మెయిన్ రోడ్ మీదుగా గురజాడ కళాక్షేత్రం వద్ద ముగిసింది. యాత్ర మార్గమంతా భక్తులకు స్వామివారి ప్రసాదం పంపిణీ చేయబడింది. గురజాడ కళాక్షేత్రం వేదికపై వేదమంత్రాలతో అర్చకులు అర్చనలు నిర్వహించగా, సాంబాదాస్ ప్రభుజి జగన్నాథుని లీలలను వివరిస్తూ మాతాజీ నితాయ్ సేవిని గారి ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులను మనస్సులోకి మరల్చింది. 1008 రకాల ప్రసాదాలు స్వామికి ...

Digital Advancements Paving the Way for Ambedkar’s Vision of Social Justice

చిత్రం
Integrating Technology into Education is Crucial - AI in education will help marginalized and differently-abled learners – Digital Advancements Paving the Way for Ambedkar’s Vision of Social Justice V isakhapatnam: Prof. M. James Stephen, the Dr. B.R. Ambedkar Chair Professor at Andhra University, delivered two expert lectures on the theme “AI and Adaptive Learning in Inclusive Education” at the Indian Institute of Technology (IIT), Bhubaneswar. These sessions were part of the ongoing Faculty Development Program (FDP) on “AI and Adaptive Learning in Inclusive Classrooms,” being organized by the School of Humanities, Social Sciences and Management at IIT Bhubaneswar from 23rd to 27th June 2025. The FDP is aimed at empowering faculty members across disciplines with the knowledge and tools to integrate Artificial Intelligence into inclusive pedagogical practices. In recognition of his substantial contributions and expertise in the domains of Artificial Intelligence and Inclusive Education...

ఆడారి కిషోర్ కుమార్ కు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం

చిత్రం
 ఆడారి కిషోర్ కుమార్ కు న్యాయ శాస్త్రంలో  డాక్టరేట్ ప్రధానం ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి  ఆడారి కిషోర్ కుమార్  దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  ఆచార్య ప్రకాష్ రావు మార్గదర్శనంలో   " ఉమన్ ఎంపవర్మెంట్ త్రు కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ లాస్ ఎ సోషియో లీగల్ స్టడీ ఇన్ స్పెషల్ రెఫరెన్స్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్ " అనే అంశం పైన  చేసిన పరిశోధనకు గాను పి హెచ్ డీ లభించింది. పి హెచ్ డీ డిగ్రీని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో  కిషోర్ కుమార్ కి అందజేసి అభినందించారు . కార్యక్రమంలో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపాల్  ఆచార్య కె. సీతామాణిక్యం  తదితరులు పాల్గొని కిషోర్ కుమార్ ని అభినందించారు. ఆడారి కిషోర్ కుమార్ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఆడారి వరహా సత్య నాగభూషణరావు, మహాలక్ష్మమ్మ దంపతులకు  అనకాపల్లి లోజన్మించారు. చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాల వైపు ఆసక్తి పెంచుకున్న కిశోర్ కుమార్ వాటిలో పాల్గొంటూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. అనకాపల...

ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి

చిత్రం
  ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి  - ప్రత్యామ్నాయల పై దృష్టి సారించాలి   - పర్యావరణహితంగా జీవనం ఉండాలి  విశాఖపట్నం మే 4:  పర్యావరణహితంగా, ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా మానవ జీవన విధానం ఉండాలని కృష్ణ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య ఎస్.రామకృష్ణారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈరోజు విద్యా విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన పర్యావరణ సంబంధిత అంశాలపై ప్రత్యేక ప్రసంగం అందించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎస్.రామకృష్ణారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలు వస్తున్నాయని వాటిని వినియోగించడం వలన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. వియత్నాం దేశంలో అరటి గుజ్జుతో ప్లేట్లు తయారు చేస్తున్నారని, యూరప్ లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తున్న విధానాలను వివరించారు. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం, ప్యాకింగ్ చేయడం అనారోగ్యాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. పౌరులు సామ...

ఏయూ పరిధిలో విద్యార్థులకు 50,000 ఇంటర్న్ షిప్ లు

చిత్రం
 నాస్కామ్ ఉచిత ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం కి దరఖాస్తుల ఆహ్వానం ఏయూ పరిధిలో విద్యార్థులకు 50,000 ఇంటర్న్ షిప్ లు విశాఖపట్నం, జూన్ 3: నాస్కామ్(NASSCOM) ఫ్యూచర్ స్కిల్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత స్వల్పకాలిక ఇంటెన్షిప్ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ఈరోజు తన కార్యాలయంలో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా నాస్కామ్ సహకారంతో విద్యార్థులకు ఈ ఉచిత స్వల్పకాలిక ఇంటర్న్ షిప్ లను అందిస్తున్నట్లు ఆచార్య రాజశేఖర్ తెలిపారు. ఏయూ పరిధిలో 50,000 మంది ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కల్పిస్తారని దీనికి ఈ నెల 7వ తేదీలోగా ఉన్నత విద్యా మండలి పోర్టల్ లో విద్యార్థులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ ఇంటర్న్ షిప్ ను నాలుగు విభాగాల్లో అందిస్తున్నట్లు తెలిపారు. సర్వీస్ నౌ సిస్టం అడ్మినిస్ట్రేటర్, ఎసెంచర్  ఆధ్వర్యంలో ఏఐ ఫండమెంటల్ అండ్ ఏఐ రెడీ ఆఫ్ ఏఐ అసెండ్, గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ, సేల్స్ ఫోర...

గోల్డ్ మెడల్, ఎండోమెంట్ స్కాలర్షిప్ కు విరాళం

చిత్రం
 గోల్డ్ మెడల్, ఎండోమెంట్ స్కాలర్షిప్ కు  విరాళం  విశాఖపట్నం మే 3: ఆంధ్ర విశ్వవిద్యాలయం నావెల్ ఆర్కిటెక్చర్ విభాగంలో రాజ్–టిఏఐ గోల్డ్ మెడల్ ఏర్పాటు చేయడానికి మూడు లక్షల రూపాయల విరాళాన్ని, శిరి అండ్ అనిల్ రాజ్ ఎండోమెంట్ స్కాలర్షిప్ ఏర్పాటు చేయడానికి రూ 7,50,000 విరాళాన్ని టెక్నాలజీ అసోసియేట్స్ సంస్థ విరాళాన్ని అందించింది. విరాళానికి సంబంధించిన డీడీలను  టిఎఐ ఇంజనీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జానకి రామన్ గణేషన్  ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావుకు అందజేశారు. నేవల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్  విభాగంలో ప్రతిభ చూపిన విద్యార్థికి గోల్డ్ మెడల్ ను బహుకరించాలని, అదేవిధంగా విద్యలో ప్రతిభ చూపుతూ ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థికి స్కాలర్షిప్ ను బహుకరించాలని దాతలు కోరారు.  ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బంగారు పతకం, స్కాలర్షిప్ కు అవసరమైన నిధులను అందించిన దాతలను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తిని కలిగిస్తాయని అన్నారు. వ...

ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం

చిత్రం
 ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం  – పర్యావరణహితంగా మన జీవన విధానం ఉండాలి – పర్యావరణ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ  విశాఖపట్నం జూన్ 3:  ప్రజలందరి భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. జూన్ 5 ఏయు విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఈరోజు ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితంగా మన జీవన విధానాన్ని మలచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా నిలిచే బి.ఈ.డి, ఎంఈడి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. తద్వారా వారు పాఠశాల స్థాయి నుంచి చిన్నారులలో పర్యావరణ స్పృహను పెంపొందించడం, సంరక్షించే బాధ్యతను వారికి అందించడం జరుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే మానవ మనుగడ సాధ్యపడుతుందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని తదనగుణంగా నడుచుకోవాలని సూచించారు. విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు మాట్లాడుతూ పర్యావరణంలో అనేక జీవులు, వృక్షాలు పరస్పరం సహకారంతో ముందుక...

క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది

చిత్రం
 క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలవడుతుంది - క్రీడలకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది  - ప్రపంచ పటంలో విశాఖ స్థానం పదిలం  విశాఖపట్నం మే 31:  క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలబడుతుందని తద్వారా వారు సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని పలువురు శాసనసభ్యులు అన్నారు. శనివారం సాయంత్రం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీగా ఎంపికైన డాక్టర్ డి. భగీరథ కుమార్, ఐ సి ఏ ఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.ప్రసన్న కుమార్ ల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యుల గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. ప్రపంచ పటంలో క్రీడల్లో విశాఖ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది అని అన్నారు. యువత విద్యతోపాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. తద్వారా రాష్ట్రానికి, దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం సాధ్యపడుతుందని అన్నారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్నకుమార్ లు జాతీయస్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం నగరానికి ఎంతో గర్వకారణం అని అన్నారు.  విశాఖ నగరానికి, తాము చేపట్టిన పదవులకు మరింత...