గోల్డ్ మెడల్, ఎండోమెంట్ స్కాలర్షిప్ కు విరాళం

 గోల్డ్ మెడల్, ఎండోమెంట్ స్కాలర్షిప్ కు  విరాళం 

విశాఖపట్నం మే 3:

ఆంధ్ర విశ్వవిద్యాలయం నావెల్ ఆర్కిటెక్చర్ విభాగంలో రాజ్–టిఏఐ గోల్డ్ మెడల్ ఏర్పాటు చేయడానికి మూడు లక్షల రూపాయల విరాళాన్ని, శిరి అండ్ అనిల్ రాజ్ ఎండోమెంట్ స్కాలర్షిప్ ఏర్పాటు చేయడానికి రూ 7,50,000 విరాళాన్ని టెక్నాలజీ అసోసియేట్స్ సంస్థ విరాళాన్ని అందించింది. విరాళానికి సంబంధించిన డీడీలను  టిఎఐ ఇంజనీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జానకి రామన్ గణేషన్  ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావుకు అందజేశారు.

నేవల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్  విభాగంలో ప్రతిభ చూపిన విద్యార్థికి గోల్డ్ మెడల్ ను బహుకరించాలని, అదేవిధంగా విద్యలో ప్రతిభ చూపుతూ ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థికి స్కాలర్షిప్ ను బహుకరించాలని దాతలు కోరారు. 

ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బంగారు పతకం, స్కాలర్షిప్ కు అవసరమైన నిధులను అందించిన దాతలను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తిని కలిగిస్తాయని అన్నారు. వీటితోపాటు విద్యార్థులకు నైపుణ్యతను పెంపొందించడానికి అవసరమైన ఇంటర్న్ షిప్ లు అందించాలని కోరారు. భవిష్యత్తులో సైతం ఇదే విధమైన సహాయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న