ఆడారి కిషోర్ కుమార్ కు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం
ఆడారి కిషోర్ కుమార్ కు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి ఆడారి కిషోర్ కుమార్ దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రకాష్ రావు మార్గదర్శనంలో " ఉమన్ ఎంపవర్మెంట్ త్రు కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ లాస్ ఎ సోషియో లీగల్ స్టడీ ఇన్ స్పెషల్ రెఫరెన్స్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్ " అనే అంశం పైన చేసిన పరిశోధనకు గాను పి హెచ్ డీ లభించింది.
పి హెచ్ డీ డిగ్రీని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో కిషోర్ కుమార్ కి అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య కె. సీతామాణిక్యం తదితరులు పాల్గొని కిషోర్ కుమార్ ని అభినందించారు.
ఆడారి కిషోర్ కుమార్ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఆడారి వరహా సత్య నాగభూషణరావు, మహాలక్ష్మమ్మ దంపతులకు అనకాపల్లి లోజన్మించారు. చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాల వైపు ఆసక్తి పెంచుకున్న కిశోర్ కుమార్ వాటిలో పాల్గొంటూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. అనకాపల్లి ఏ ఎం ఏ ఎల్ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయి ఆయా విద్యాసంస్థలకు విశేషమైన సేవలను అందించారు . తదుపరి జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్యమ నాయకుడిగా కిషోర్ కుమార్ కు చక్కని గుర్తింపుని తీసుకొని వచ్చింది. సమైక్యాంధ్ర గురించి ఆయన చేసిన పోరాటం సామాజిక రాజకీయ నేతలను మేధావులను ఆశ్చర్యపరచడమే కాక వారి ప్రశంసలకు కారణమైంది. దీనితో పాటు వివిధ సేవా కార్యక్రమాలను కిషోర్ కుమార్ నిర్వహించారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఆయన ఫ్యాప్టో నిర్వహించిన జాతా లో పాల్గొనడమే కాకుండా విశాఖ నగరానికి వైద్య అవసరాల కోసం వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయుల కోసం ఉచిత వసతి, అత్యవసరమైన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల ద్వారా అందించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని 400 రోజులు పాటు నిర్విరామంగా నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లా ప్రశంసలను పొందారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. గతంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. కర్షక దేవోభవ అనే కార్యక్రమాన్ని చేపట్టి 50 రోజులపాటు రైతులకు వివిధ అవగాహన సదస్సులను నిర్వహించారు. ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి