అంగ రంగ వైభవంగా ఇస్కాన్ శ్రీ జగన్నాథ రథయాత్ర
అంగ రంగ వైభవంగా ఇస్కాన్ శ్రీ జగన్నాథ రథయాత్ర
ఇస్కాన్ విశాఖపట్నం శాఖ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభు ఆధ్వర్యంలో 18వ సారి శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. మంగళధ్వని, కోలాటం, భజనలు, సంకీర్తనలు, హరే కృష్ణ మహామంత్ర గోష్పద ధ్వనులతో రథయాత్ర ప్రారంభమైంది. సుభద్రా, బలరామ, శ్రీ జగన్నాథ స్వామివారు పుష్పాలతో అలంకరించబడిన రథంపై భక్తుల కోలాహల మధ్య విహరించారు.
ఈ కార్యక్రమానికి సాంబాదాస్ మాతాజీ నితాయ్ సేవిని గారు రథం ముందు కొబ్బరికాయ కొట్టి, సేవాభావంతో ఊడ్చి రథయాత్రను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం ఎమ్మెల్యే గణబాబు గారు హాజరయ్యారు. జీవీఎంసీ సెంట్రల్ పార్క్ నుండి ప్రారంభమైన యాత్ర, డాబాగార్డెన్స్, జగదాంబ సెంటర్, రామనగర్ మెయిన్ రోడ్ మీదుగా గురజాడ కళాక్షేత్రం వద్ద ముగిసింది. యాత్ర మార్గమంతా భక్తులకు స్వామివారి ప్రసాదం పంపిణీ చేయబడింది.
గురజాడ కళాక్షేత్రం వేదికపై వేదమంత్రాలతో అర్చకులు అర్చనలు నిర్వహించగా, సాంబాదాస్ ప్రభుజి జగన్నాథుని లీలలను వివరిస్తూ మాతాజీ నితాయ్ సేవిని గారి ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులను మనస్సులోకి మరల్చింది.1008 రకాల ప్రసాదాలు స్వామికి నివేదించబడి, మంగళ హారతులు, మంత్రపుష్పార్చనలు నిర్వహించబడ్డాయి. రథయాత్రలో పాల్గొన్న భక్తులు స్వామీజీ, మాతాజీ చేతుల మీదుగా ప్రసాదం స్వీకరించారు.
ఈ వేడుకలో సాంస్కృతిక ప్రదర్శనలు, అన్నప్రసాద వితరణ, మరియు శ్రీ జగన్నాథ నామస్మరణతో శ్రద్ధతో, భక్తితో, వైభవంగా ఉత్సవం కొనసాగింది. ముఖ్య ఆధ్యాత్మికులు ఎం.వి. రాజశేఖర్, వంశీప్రభు, జ్యోతి, మరియు ఇస్కాన్ జీవితకాల సభ్యులు, పుర ప్రముఖులు, మహిళా సేవకులు, వలంటీర్లు పాల్గొన్నారు. శ్రీ జగన్నాథ నామం తో మారుమ్రోగిన గురజాడ కళాక్షేత్రం, భక్తులందరికీ ఓ ఆధ్యాత్మిక అనుభూతి కలిగించింది.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి