ఏయూ పరిధిలో విద్యార్థులకు 50,000 ఇంటర్న్ షిప్ లు
నాస్కామ్ ఉచిత ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం కి దరఖాస్తుల ఆహ్వానం
ఏయూ పరిధిలో విద్యార్థులకు 50,000 ఇంటర్న్ షిప్ లు
విశాఖపట్నం, జూన్ 3:
నాస్కామ్(NASSCOM) ఫ్యూచర్ స్కిల్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత స్వల్పకాలిక ఇంటెన్షిప్ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ఈరోజు తన కార్యాలయంలో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా నాస్కామ్ సహకారంతో విద్యార్థులకు ఈ ఉచిత స్వల్పకాలిక ఇంటర్న్ షిప్ లను అందిస్తున్నట్లు ఆచార్య రాజశేఖర్ తెలిపారు. ఏయూ పరిధిలో 50,000 మంది ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కల్పిస్తారని దీనికి ఈ నెల 7వ తేదీలోగా ఉన్నత విద్యా మండలి పోర్టల్ లో విద్యార్థులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ ఇంటర్న్ షిప్ ను నాలుగు విభాగాల్లో అందిస్తున్నట్లు తెలిపారు. సర్వీస్ నౌ సిస్టం అడ్మినిస్ట్రేటర్, ఎసెంచర్ ఆధ్వర్యంలో ఏఐ ఫండమెంటల్ అండ్ ఏఐ రెడీ ఆఫ్ ఏఐ అసెండ్, గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ, సేల్స్ ఫోర్స్ డెవలపర్ విభాగాల్లో ఇంటర్న్ షిప్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. తద్వారా భవిష్యత్తులో విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాలను పొందడానికి ఇటువంటి ఇంటర్న్ షిప్ లు ఎంతగానో దోహదపడతాయని వైస్ ఛాన్సలర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావు, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ రీజినల్ హెడ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇతర వివరాల కోసం 9052656967 నెంబర్ కి సంప్రదించవచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి